Samantha: కుర్ర హీరోలనే జోడీగా ఎంచుకుంటున్న సమంత.. ఆ మర్మమేంటో?

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సమంత ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా గత ఏడాది యశోద సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సమంత ఇటీవలె శాకుంతలం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచాయి. ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, సాంగ్ కి ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. దీంతోపాటుగా సమంత సిటాడెల్ అనే ఒక హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం సమంత హీరో సిద్దు జొన్నలగడ్డతో ఒక సినిమాలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఆ సినిమాను రామ్ తాళ్లూరి నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక హీరోయిన్ సమంత నందిని కాంబినేషన్ లో ఇప్పటికి రెండు సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే.

 

అలాగే నిర్మాత రామ్ తాళ్లూరి కూడా గతంలో పలు సినిమాలను తెరకెక్కించగా ఈ మధ్యకాలంలో కాస్త గ్యాప్ ఇచ్చారు. ఒకవేళ ఈ ప్రాజెక్టు కన్ఫామ్ అయితే నిజంగా క్రేజీ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే ఈ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో అదేంటి సమంతకు వరుసగా యంగ్ హీరోలు సరసన నటించే అవకాశాలు వస్తున్నాయి. సమంతకు కుర్ర హీరోలే దిక్కయ్యారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. స్టార్ హీరోలను పక్కన పెట్టిన సమంత ఎందుకు యంగ్ హీరోల సినిమాలను ఎంచుకుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -