Samantha Ruth Prabhu: హీరోయిన్ సమంత ఆస్పత్రిలో చేరారా.. ఏమైందంటే?

Samantha Ruth Prabhu: టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ఆరోగ్యంపై సోషల్‌ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి. దీనిపై తొలుత ఆమె మేనేజర్‌ స్పందించి అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. తర్వాత సమంత నేరుగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా తను బాధపడుతున్న జబ్బు గురించి వివరించిన సంగతి తెలిసిందే. అరుదైన మయోసైటిస్‌ జబ్బు కారణంగా తాను సఫర్‌ అవుతున్నానని ఇన్‌ స్టా వేదికగా ప్రకటించింది సామ్.

 

అయితే, ఇదంతా టాలీవుడ్‌ సంగతి. అయితే, ఆమె ఇన్ స్టా గ్రామ్‌లో పోస్టు పెట్టినప్పటికీ అటు తమిళ ఇండస్ట్రీలో మాత్రం సమంత గురించి సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోందని తెలుస్తోంది. సమంతకు తీవ్ర అనారోగ్యం కలిగిందని, ఆస్పత్రిలో చేరిందంటూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సమంత మేనేజర్‌ ఈ వార్తలపై స్పందించారు.

 

అవన్నీ పుకార్లే.. నమ్మవద్దు
సమంత ఆరోగ్యంపై వదంతులు నమ్మవద్దని ఆమె మేనేజర్‌ తాజాగా క్లారిటీ ఇచ్చారు. తమిళ మీడియాలో, సోషల్‌ మీడియాలో సాగుతున్న ప్రచారం అవాస్తవమని చెప్పారు. అనారోగ్యం కారణంగా సమంత ఆస్పత్రిలో చేరిందన్న వార్తలు నిరాధారమని వెల్లడించారు. ఈ వార్తలను సమంత మేనేజర్‌ ఖండించారు. సమంత తన ఇంట్లో ఆరోగ్యంగా ఉన్నారని, ఇలాంటి వార్తలను ప్రసారం చేయవద్దని సూచించారు.

 

మరోవైపు ఇటీవల సమంత నటించిన సినిమా యశోద రిలీజైన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ అంచనాలను అందుకుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో సమంత యాక్షన్‌ ఫైట్‌ సీన్స్‌లో నటించి మెప్పించారు. ఓవైపు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ సమంత యాక్షన్‌ సీన్స్‌లో నటించడం గొప్ప విషయమని అభిమానులు మెచ్చుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts