Samantha: నాగచైతన్య పై కోపంతో సమంతా రెండో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?

Samantha: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏం మాయ చేసావే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన సమంత… తన అందం అభినయంతో మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్ని మాయ చేసి తనకి అభిమానులుగా మార్చుకుంది. ఈ క్రమంలో ఈ సినిమాలో సమంతకి జోడిగా నటించిన నాగచైతన్యతో ఏర్పడిన పరిచయం కొంతకాలానికి ప్రేమగా మారింది.

ఇలా వీరిద్దరి మధ్య మొదలైన ప్రేమ పెళ్లికి దారితీసింది.

చాలాకాలం ఒకరినొకరు ప్రేమించుకున్న వీరిద్దరూ ఇరుకుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వివాహం చేసుకున్న తర్వాత వీరిద్దరూ కూడా బెస్ట్ కపుల్ గా అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇలా కొంతకాలం ఎంతో సంతోషంగా ఉన్న వీరిద్దరూ కొన్ని రోజులుగా ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ విడాకులు తీసుకొని ఒకరికి ఒకరు దూరమయ్యారు.

సమంత నాగచైతన్య మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగానే ఇద్దరు విడిపోయినట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం. అయితే వీరి వీడిపోవటానికి గల అసలు కారణం గురించి ఇప్పటివరకు ఎవరికి తెలియడం లేదు.నాగచైతన్యకు దూరమైన తర్వాత సమంత బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి అక్కడ కూడా వరుస సినిమా అవకాశాలను అందుకుని బిజీగా ఉంటుంది. ప్రస్తుతం తెలుగు తమిళ్ హిందీ భాషలలో వరుస సినిమాలలో నటిస్తున్న సమంతా గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

నాగచైతన్య మీద ఉన్న కోపంతో సమంత రెండవ పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఒక బాలీవుడ్ హీరోని సమంత రెండవ పెళ్లి చేసుకోనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ 2 షూటింగ్ సమయంలో ఆ వ్యక్తితో సమంతకు ఏర్పడిన పరిచయం చదవుగా మారి ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సమంత స్పందించాల్సి ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Judges Trolling Case: జడ్జి హిమబిందుని అవమానించేలా పోస్టు పెట్టిన ‍వ్యక్తి అరెస్ట్‌.. ఆ వ్యక్తి ఎవరంటే?

Judges Trolling Case: చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అరెస్టు అయిన విషయం మనకు తెలిసిందే. నంద్యాలలో సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడుని అదుపులోకి...
- Advertisement -
- Advertisement -