Samantha: విడాకులపై నోరు మెదిపిన సమంత.. చైతన్య చేతిలో మోసపోయానంటూ?

Samantha: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సమంత గురించి తెలియని వారంటూ ఉండరు. ప్రస్తుతం సమంత సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా నార్త్ లో కూడా వరుస సినిమా అవకాశాలు అనుకుంటుంది. అంతేకాకుండా హాలీవుడ్ సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకుంది. ఇదిలా ఉండగా ఇటీవల అనారోగ్యం వల్ల కొంతకాలం సినిమాలకు దూరమైన సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. శాకుంతలం సినిమా మీద చాలా నమ్మకం పెట్టుకుంది.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమాని జోరుగా ప్రమోట్ చేస్తోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అలాగే నాగచైతన్యతో తాను విడిపోవడానికి గల కారణాలు గురించి తెలిపింది. ఈ క్రమంలో సమంత మాట్లాడుతూ..విడాకులు తీసుకున్న తర్వాత పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ఆఫర్ రాగా ఆ ఆఫర్ కు వెంటనే ఓకే చెప్పానని సమంత వెల్లడించారు.

 

విడాకులు తీసుకున్న తర్వాత ఇలా ఐటం సాంగ్స్ లో నటించటం మంచిది కాదని, ఇంట్లో కూర్చోవాలి అని కొందరు చెప్పారు. అయితే నేను ఏ తప్పు చేయలేదని తప్పు చేయని నేను బాధ పడుతూ ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం ఏముందని అనిపించిందని సమంత చెప్పుకొచ్చారు. వైవాహిక బంధంలో భార్యగా నేను 100 శాతం నిజాయితీగా ఉన్నానని, అయితే అది వర్కౌట్ కాలేదని సమంత తెలిపారు.

 

విడాకుల తర్వాత నేనేదో నేరం చేసిన దానిలా దాక్కోవాల్సిన అవసరం ఏముందని సమంత ప్రశ్నించారు.అలాగే నేను చేయని నేరానికి నన్ను నేను హింసించుకుని ఎందుకు బాధ పడాలని ఆమె అన్నారు.నా జీవితంలో ఎన్నో బాధలు అనుభవించి వాటిని దాటుకొని ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని సమంత చెప్పుకొచ్చింది. అయితే సమంత చేసిన వ్యాఖ్యలను సమంత ఫ్యాన్స్ కూడా సమర్థిస్తున్నారు . అంతే కాకుండా భవిష్యత్తులో కూడా ఇంకా మంచి సినిమాలు చేయాలని వారు కోరుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Lokesh: లోకేశ్ వల్ల పార్టీకి నష్టమేనా.. పార్టీ పరిస్థితి దారుణం కానుందా?

Lokesh: లోకేష్ తన పాదయాత్రని ప్రారంభించి వంద రోజులు దాటింది అయినా ఆయన యాత్రలో గాని కార్యకర్తలలో గాని ఎక్కడ పెద్దగా ఉత్సాహం కనిపించడం లేదు. లోకేష్ ప్రసంగాలు కూడా చాలా పేలవంగా...
- Advertisement -
- Advertisement -