Samantha: స్టార్ హీరోయిన్ సామ్ అలాంటి సెంటిమెంట్ ను పాటిస్తారా?

Samantha: సినీ పరిశ్రమల్లో పెద్ద తారలకు, బడా బడా వ్యాపారవేత్తలకు, పెద్ద నాయకులకు.. వీరందరికీ మనం ఊహించని కొన్ని నమ్మకాలు ఉంటాయి. వాటిని వారు నమ్మే విషయం మనం నమ్మలేం. ఇక సినీ పరిశ్రమలో ఇలాంటి నమ్మకాల గురించి చెప్పనక్కరలేదు. టాప్ హీరోలు, హీరోయిన్లు ఇలాంటి నమ్మకాలు చాలానే పాటిస్తారు. బాలయ్య బాబు, ఎన్టీఆర్, పవర్ స్టార్ ఇలా చాలా మంది అగ్ర నాయకులు శాస్త్రాలు నమ్ముతారు. అయితే కొన్ని సార్లు ఆ నమ్మకాలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి.

 

 

ఇక ఇప్పుడు అలాంటి ఒక విషయమే అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. స్టార్ హీరోయిన్ సమంత ” ఆటో ఇమ్యూన్ వ్యాధి” నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కొన్ని ఇంటర్వ్యూల్లో కనబడ్డ సమంతను చూసి చాలా మంది ఆశ్చర్య పోతున్నారు. దానికి కారణం ఆమె ధరించిన ఉంగరాలే. అవి మూడు విభిన్నమైన రంగురాళ్లు. ఇక ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు వాటిని ఫోకస్ చేయడంతో అవి చర్చనీయాంశంగా మారాయి.

సమంత ధరించిన ఉంగరం “నక పుష్య రాగం” గా తెలుస్తోంది. ఇది సమృద్ధిగా సంపద- ఆరోగ్యం- కీర్తి- ఫలవంతమైన సంబంధాలను కలిగిస్తుందని విస్తృతమైన నమ్మకం. గోమేధకం (హెస్సోనైట్) రాయి ఉంగరం మరియు ముత్యం ఉంగరాలు కూడా సమంత ధరించింది. ఇవి చేదు నుండి కాపాడడం, చంద్ర బలంతో మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇక సమంత ఈ మూడు రాళ్ల యఁగారాలు ధరించడం పెద్ద చర్చకే దారితీసింది. హిందూ జీవన విధానం ప్రకారం మంచి జరగడానికి శాస్త్ర నిపుణులు ఇలాంటివి ధరించమని సూచిస్తారు.

అయితే సమంత జననం ప్రకారం క్రిస్టియన్.. కానీ చిత్ర పరిశ్రమలో అడుగిడిన తర్వాత హిందుత్వాన్ని స్వీకరించారు. సామ్ తరచుగా తిరుమలశ్రీవారిని , కాళహస్తీశ్వరుని దర్శిస్తారు. ఇటీవల సికిందరాబాద్ లో వేద పాఠశాలలో కొన్ని పూజలు, హోమాలు చేసారు. ఇలా తాను ప్రస్తుతం ఎదుర్కొంటున్న కష్టాలను అధిగమించడానికి హిందూ ఆచారాలను, సంప్రదాయాలను నమ్మకం, భక్తిశ్రద్దలతో అనుసరిస్తుందని నెట్టింట చర్చ జరుగుతుంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: జగన్ మెప్పు కోసం ఈసీ గైడ్ లైన్స్ ఉల్లంఘిస్తున్న అధికారులు.. కొరివితో తల గోక్కుంటున్నారంటూ?

YS Jagan: ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా అధికారులు వైసీపీ నేతలు అడుగుజాడల్లో నడుస్తున్నారు. మరీ ముఖ్యంగా జగన్ పై స్వామి భక్తి చాటుకుంటున్నారు. అధికారుల వ్యవహారం చూస్తూ ఏపీలో ఈసీ...
- Advertisement -
- Advertisement -