MLA: ఈయన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే.. ఎక్కడో చూసినట్టుందే! సంగారెడ్డి వాళ్లకైనా తెలుసా లేదా..?

MLA: సినిమాలలో నటీనటులు పాత్రకు తగ్గట్టుగా తమ ఆహర్యాన్ని మార్చుకుంటారు. రాజకీయాలలో అది మరో విధంగా ఉంటుందిలెండి. పార్టీల కండువాలు మార్చినంత ఈజీగా తమ రూపాలను మార్చుకోలేరు నాయకులు. కొంతమంది నాయకులైతే తాము ప్రజల ముందు కనబడే విధానంలో తమ బ్రాండ్‌ను అస్సలు వదులుకోరు. అటువంటి నాయకులలో సంగారెడ్డి ఎమ్మెల్యే (కాంగ్రెస్) తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఒకరు. జయప్రకాశ్ రెడ్డి పేరు చెబితే ఆయనకు ఉండే పొడవాటి వెంట్రుకలు, గుబురు గడ్డమే మదిలో మెదులుతుంది. కానీ ఆయన కూడా రూట్ మార్చారు.

జగ్గారెడ్డిని గడ్డం, హెయిర్ స్టైల్ లేకుండా చూడటం చాలా అరుదు. అసలు లేదని చెప్పినా అతిశయోక్తి కాదు. కానీ ఆయన ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. ఇటీవలే కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుని సేవలో తరించిన ఆయన స్వామికి తలనీలాలు సమర్పించారు. జుట్టుతో పాటు గడ్డం కూడా తీసేసిన ఆయన ఫోటో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

స్వతహాగా జగ్గారెడ్డికి దైవభక్తి ఎక్కువే. సంగారెడ్డిలో ఆధ్యాత్మిక కార్యక్రమం ఏది జరిగినా ఆయన ఉండాల్సిందే. నియోజకవర్గంలో ఏ ఊళ్లో దైవ కార్యక్రమాలు జరిగినా ఆయన తప్పకుండా పాల్గొంటారు. ఇక చవితి, నవరాత్రుల సమయంలో జగ్గారెడ్డి అండ లేని మంటపాలు ఉండవు. నిత్యం ఏదో మొక్కుతో దైవసేవలో ఉండే జగ్గారెడ్డి.. ఇప్పుడు తిరుపతికి వెళ్లి తలనీలాలు సమర్పించుకున్నారంటే ఆయనకు చెందిన ఏదో భారీ కోరికే నెరవేరినట్టుందనుకుంటున్నారు ఆయన అభిమానులు. ఇటీవల రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’లో కూడా జగ్గారెడ్డి.. నిండైన గడ్డం, జట్టుతోనే దర్శనమిచ్చి ఇంతలోనే నయా లుక్ లోకి మారడం గమనార్హం.

ఇక జగ్గారెడ్డి తలపై జట్టు, గడ్డం లేకుండా ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు.. పాత తమిళ్ సినిమాలో ప్రతినాయకుడిగా మాదిరిగా ఉన్నారేంటి సార్..? అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు.. ‘తెలంగాణలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన ఈయన ఎవరో కనుక్కోండి..?’ అని క్విజ్ పోటీలు పెడుతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో గుప్త నిధుల కొరకు తవ్వకాలు.. ఈ ఆరోపణలపై వైసీపీ స్పందిస్తుందా?

Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్ డైమండ్ దొంగలించారు. ఐదేళ్ల క్రితం వచ్చిన ఈ ఆరోపణలను ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే టీటీడీ అప్పటి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గత ప్రభుత్వంపై చేసిన...
- Advertisement -
- Advertisement -