Sanjay Manjrekar: ముంబైకి రషీద్ లాంటోడు అవసరం అంటున్న సంజయ్ మంజ్రేకర్

Sanjay Manjrekar: ఐపీఎల్–2023కు ఇంకా సమయం ఉన్నప్పటికీ హంగామా అప్పుడే మొదలైపోయింది. ఆటగాళ్ల వేలానికి టైమ్ ఫిక్స్ అయింది. డిసెంబర్ 23 (శుక్రవారం)న జరగబోయే మినీ వేలంల అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఏడాది వేలంలో 87 స్థానాల కోసం 405 మంది ఆటగాళ్లు బరిలోకి నిలిచారు. బెన్ స్టోక్స్, ఆడమ్ జంపా, మయాంక్ అగర్వాల్, కేన్ విలియమ్సన్ లాంటి స్టార్లను ఆయా ఫ్రాంచైజీలు వదులుకోవడంతో వారంతా వేలంలోకి వచ్చేశారు.

 

స్టార్ ప్లేయర్లు వేలంలోకి రావడంతో వారిని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడనున్నాయి. పంజాబ్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఎక్కువ సొమ్ము ఉండటంతో వాళ్లు కీలక ఆటగాళ్లను దక్కించుకోవడంపై దృష్టి సారించే చాన్స్ కనిపిస్తోంది. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. ముంబై జట్టు బౌలర్లను తీసుకోవడం పై కాన్ సంట్రేట్ చేస్తుందని ఆయన అన్నాడు.

 

‘ముంబై జట్టును బౌలర్ల సమస్య వేధిస్తోంది. వారి బౌలింగ్ అటాక్ లో క్వాలిటీ కనిపించడం లేదు. అందుకే ఈసారి మంచి బౌలర్లను తీసుకోవడం మీద వారి దృష్టి ఉంటుంది. ఈసారి బుమ్రాతోపాటు జొఫ్రా ఆర్చర్ కూడా వచ్చేస్తాడు. అలాగే జాసన్ బెహ్రెన్ డార్ఫ్ కూడా ఉండటం విశేషం. అయితే రషీద్ ఖాన్ లాంటి స్పిన్నర్ అవసరం వారికెంతో ఉంది. బౌలింగ్ తోపాటు బ్యాటింగ్ లోనూ రాణించే అలాంటి ఆటగాడు అందరికీ కావాలి. కాబట్టి జంపా, ఆదిల్ రషీద్ లో ఒకరిని ఆ జట్టు తీసుకోవచ్చు’ అని సంజయ్ చెప్పుకొచ్చారు.

 

జంపా కోసం పోటీ తప్పదు: సంజయ్ మంజ్రేకర్
‘మినీ వేలంలో ఆడమ్ జంపా కోసం తీవ్ర పోటీ ఉంటుంది. కేన్ విలియమ్సన్ ను వదులుకోవడంతో ఓపెనర్ కోసం సన్ రైజర్స్ అన్వేషించాల్సి ఉంటుంది. అందుకే మయాంక్ అగర్వాల్ ను తీసుకునేందుకు వారు ఇష్టపడతారు. భయపడకుండా ఆడేతత్వం మయాంక్ సొంతం. పంజాబ్ కు కెప్టెన్ గా వ్యవహరించిన అతడి అనుభవం హైదరాబాద్ జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది’ అని సంజయ్ పేర్కొన్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -