Sanju: FBలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి..తర్వాత పెళ్లి వరకు వెళ్లిన సంజూ శాంసన్!

Sanju: టీమిండియా ఆటగాళ్లలో ఇప్పుడు భారీ అంచనాలున్న క్రికెటర్ల జాబితాలో సంజూ శాంసన్ పేరు కూడా ఉంటుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ లో టీమిండియా తరఫున ఆడటంతో పాటు ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున సంజూ బాగా రాణిస్తున్నాడు. టీమిండియా ఆడే ప్రతి టోర్నీలో తనదైన స్టైల్ ఆటతో అందరినీ ఆకట్టుకుంటున్న సంజూ లవ్ స్టోరీ ఫేస్ బుక్ ద్వారా మొదలైైందనే విషయం అందరికీ ఆసక్తి రేపుతోంది.

 

సంజూ శాంసన్, చారులతలు ఐదేళ్ల పాటు ప్రేమించుకొని ఆ తర్వాత 2018లో పెళ్లి చేసుకున్నారు. కేరళలోని త్రివేండ్రంకు చెందిన చారులత… హ్యూమన్ రిసోర్స్ లో మాస్టర్స్ చేసింది. వ్యాపార వేత్తగా సెటిల్ అవ్వాలని అనుకున్న చారుతల.. అనుకోకుండా సంజూతో ప్రేమలో పడటం,ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవడం అలా చకచకా జరిగిపోయాయి. కాగా వీరిద్దరి లవ్ స్టోరీ గురించి నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో వీరి లవ్ అప్పుడప్పుడు ట్రెండ్ అవుతుంటుంది.

సంజూ శాంసన్ పెళ్లి చేసుకున్న చారులత.. కాలేజీ రోజుల్లో అతడి క్లాస్ మేటే. తిరువనంతపురంలోని మార్ ఇవానోయిస్ కాలేజీలో వీళ్లిద్దరూ కలిసి చదువుకున్నారు. మొదట సంజూనే చారులతకు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి ఆమెకు మరింత దగ్గరయ్యాడట. అలా ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన వీరిద్దరు చాలాకాలం పాటు ఛాటింగ్ చేసుకొని, ఆ తర్వాత ప్రేమ పక్షులుగా మారిపోయారట.

పెళ్లికి  ముందు దాదాపు ఐదు సంవత్సరాల పాటు సంజూ శాంసన్, చారులతలు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెద్దల సమక్షంలో, వారి అనుమతితో వీరిద్దరు ఏడడుగులు వేశారు. 2018లో డిసెంబర్ 22న సంజూ శాంసన్, చారులతలు ఘనంగా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కాగా సంజూ శాంసన్ ప్రస్తుతం మంచి ఫాంలో ఉండి.. టీమిండియాలో ఎంతో ప్రామిసింగ్ ప్లేయర్ గా మారాడు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ కార్పొరేట్ విద్య అంటే ఇదేనా.. ఏకంగా ఇంత చేశారా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలలను కార్పొరేటర్ విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దామని నాడు నీడలో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా కార్పొరేట్ స్థాయిలో ఉన్నత చదువులు చదువుతున్నారు...
- Advertisement -
- Advertisement -