Gill: ఆమెతో డేటింగ్ చేస్తున్నా కానీ సారా టెండూల్కర్‎తో కాదు: గిల్

Gill: ఇప్పుడున్న కాలంలో సినీ స్టార్లతో క్రికెటర్ల డేటింగ్ సాధారణం అయిపోయింది. మాజీ క్రికెటర్ రవిశాస్త్రి, నేటి క్రికెటర్ శుభ్ మన్ గిల్ వరకూ కొనసాగుతూ సినీ స్టార్లతో డేటింగ్, ప్రేమాయణం నడుస్తున్నాయి. వీరితో పాటుగా విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ, యువరాజ్ సింగ్ – హాజెల్ కీచ్, హర్భజన్ సింగ్ మ- గీతా బాస్రా, జహీర్ ఖాన్ – సాగరిక ఘట్గ్రే, మహ్మద్ అజారుద్దీన్ – సంగీతా బిజ్లానీ ఈ జాబితాలో ఉన్నారు.

కొందరు బహిరంగంగానే ఒప్పుకుంటున్నా.. మరికొందరు వారి డేటింగ్ రహస్యాలను దాస్తూ ఉన్నారు. తాజాగా శుభ్ మన్ గిల్ తాను ఎవరితో డేటింగ్ లో ఉన్నానో చెప్పేశాడు. దీంతో బాలీవుడ్ అభిమానులు, క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. టెస్టు క్రికెట్లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుని జట్టులో స్థానం సుస్థిరం చేసుకుంటున్న గిల్, తాజాగా T20 వరల్డ్ కప్ కు జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. న్యూజిలాండ్ తో వన్డే, టీ 20 సిరీస్ తో మళ్ళీ జట్టులోకి వచ్చాడు.

సచిన్ కూతురితో డేటింగ్ నిజం కాదు, ఇది మాత్రం నిజం..!

ఈ క్రికెటర్ కెరీర్ ఆరంభం నుంచి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో ప్రేమాయణం నడిపిస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. వీటిపై అటు శుభ్ మన్ గిల్ గానీ, సారా టెండూల్కర్ కానీ నోరు మెదపలేదు. కాకపోతే శుభ్ మన్ గిల్ మంచి ప్రదర్శన చేసినా, నిరాశపర్చిన వీరి గురించి వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేసేవి. వీటన్నింటికి చెక్ పెడుతూ ఇండియన్ క్రికెటర్ శుభ్ మన్ గిల్ తాను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా అలీఖాన్ తో డేటింగ్ లో ఉన్నానని చెప్పేశాడు. దీంతో అటు బాలీవుడ్, ఇటు క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

తాజాగా భారతీయ క్రికెటర్ గిల్ బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌తో కలిసి రెస్టారెంట్‌లో తిరుగుతూ కనిపించాడు. ఇప్పుడు గిల్ సమాధానమిచ్చిన తీరును బట్టి, అతను వాస్తవానికి సారా అలీ ఖాన్‌తో డేటింగ్ చేస్తున్నాడనే సందేహాన్ని కలిగిస్తుంది. ఇటీవల గిల్‌ను ప్రీతి సిమోస్ మరియు నీతి సిమోస్ టాక్ షోకి ఆహ్వానించారు. ఈ టాక్ షోలో క్రికెటర్ శుభ్ మన్ గిల్ అద్భుతమైన సమాధానమిచ్చాడు. “కావచ్చు లేదా కాకపోవచ్చు.” అని బదులిచ్చాడు. ఇప్పుడు ఈ సమాధానం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడంతో అందరూ నిజమేనని అనుకుంటున్నారు

Related Articles

ట్రేండింగ్

Bonda Uma: రాయిదాడి జగన్నాటకమేనా.. బోండా ఉమను ఇరికించే విధంగా కుట్ర జరుగుతోందా?

Bonda Uma: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల రాయి దాడి ఘటన పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా చర్చలకు కారణమైంది. సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అంటూ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను...
- Advertisement -
- Advertisement -