Sarathkumar: విజయశాంతి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన శరత్ కుమార్!

Sarathkumar: కోలీవుడ్ నటుడు శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు. చాలాకాలం తర్వాత పరంపర వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శరత్ కుమార్ తాజాగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా సెప్టెంబర్ 30 వ తేదీ పాన్ ఇండియా స్థాయిలోప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటుడు శరత్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ క్రమంలోనే తాను తెలుగులో విజయశాంతితో కలిసి మొట్టమొదటి సినిమాలో నటించానని ఈయన అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

విజయశాంతి ప్రధాన పాత్రలో సమాజంలో స్త్రీ అనే సినిమా తెరకెక్కుతోంది.ఆ సినిమా నిర్మాత నా ఫ్రెండ్ కావడంతో షూటింగ్ లొకేషన్లోకి తాను వెళ్లాలని అయితే ఆరోజు షూటింగ్ జరిగే సమయంలో ఒక ఆర్టిస్టు రాకపోవడంతో ఆ సన్నివేశంలో నన్ను నటించమని నా స్నేహితుడు కోరారు. ఇలా ఆయన అడిగేసరికి నాకు యాక్టింగ్ రాదని చెప్పాను. యాక్టింగ్ రాకపోవడంతో ఆ సీన్ చేయడానికి చాలా టేకులు తీసుకున్నాను. ఇలా ఎక్కువ టేకులు కావడంతో ఎంతో ఓపికతో ఉన్న విజయశాంతి నాపై అసహనం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే విజయశాంతి మాట్లాడుతూ నేను వెంటనే చెన్నై వెళ్ళిపోవాలి ఇలా కొత్త వాళ్ళని తీసుకొచ్చినా టైం ఎందుకు వేస్ట్ చేస్తారు. కొద్దిగా మంచి ఆర్టిస్టులను పెట్టొచ్చు కదా అంటూ ఆమె విసుక్కున్నారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత విజయశాంతి నేను మరో సినిమాలో ఇద్దరం కలిసి నటించాం ఆ సినిమా షూటింగ్ సమయంలో మీరు నన్ను ఆ సినిమా సమయంలో విసుక్కున్నారు అని చెప్పగా అయ్యో సారీ అండి అంటూ అందరిముందు సారీ చెబుతూ తాను ఎంతో ఫీలయ్యారని ఈ సందర్భంగా శరత్ కుమార్ గతంలో విజయశాంతితో తనకు జరిగిన సంఘటన గురించి గుర్తు చేసుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -