GodFather: లూసీఫర్‌కి, చిరు ‘గాడ్ ఫాదర్’కి అదే తేడా: సర్వదమన్ బెనర్జీ

GodFather: మెగాస్టార్ చిరంజీవి తాజాగా చేసిన ‘గాడ్ ఫాదర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టేసింది. దసరా సందర్భంగా విడుదల అయిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండటంతో.. మెగా అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ సినిమాతో హిట్ కొట్టేశామంటూ మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మలయాళంలో వచ్చిన లూసీఫర్ సినిమాకు రీమేక్ గా చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ వచ్చింది.
‘గాడ్ ఫాదర్’ సినిమాలో చిరంజీవి తండ్రిగా, పీకేఆర్ పాత్రలో సర్వదమన్ బెనర్జీ అద్భుతంగా నటించాడు. సర్వదమన్ బెనర్జీ.. 90వ దశకంలో వచ్చిన శ్రీకృష్ణ సీరియల్ లో లీడ్ రోల్ చేశారు. గతంలో చిరంజీవితో కలిసి సర్వదమన్ బెనర్జీ ‘స్వయంకృషి’సినిమాలో నటించాడు. చాలా సంవత్సరాల తర్వాత మరోసారి చిరు సినిమాలో బెనర్జీ కనిపించాడు.
కాగా ఈ సినిమా గురించి సర్వదమన్ బెనర్జీ మాట్లాడుతూ.. ‘నా డియర్ బ్రదర్, చిరంజీవి గారు ఈ సినిమాలో చిన్న పాత్ర చేయాలని పిలిచారు. నేను పోషించిన పాత్ర చిన్నదే అయినా అందులో ఉండే కథనం, ట్విస్టులు, పాత్రలో వేరియేషన్లు అద్భుతం అని అన్నారు. ఇక ఈ సినిమాలో అసలు సిసలైన మ్యాజిక్ చిరంజీవి గారు’ అని అన్నాడు.
సక్సెస్ మీట్ లో సర్వదమన్ బెనర్జీ మాట్లాడుతూ తాను మలయాళం వర్షన్ కూడా చూసినట్లు, చిరంజీవి చాలా డిఫరెంట్ గా చేసినట్లు చెప్పారు. ‘చిరంజీవి గారి పాత్రలో నాకు శ్రీ కృష్ణుడు కనిపించాడు. ఎక్కువ డైలాగ్స్ లేకుండా కేవలం ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ తోనే అద్భుతంగా చేశారు. మాలయాళీ సినిమా అద్భుతమైన వెజిటేరియన్ వంటకం అయితే గాడ్ ఫాదర్ సినిమా అద్భుతమైన హైదరాబాద బిర్యానీ. అంత అద్భుతంగా మోహన్ రాజా చేశారు’ అని సర్వదమన్ బెనర్జీ వెల్లడించాడు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: ఐప్యాక్ స్క్రిప్ట్ ను సీఎం జగన్ ఫాలో అవుతున్నారా.. స్క్రిప్ట్ ప్రకారమే సామాన్యుల్ని కలుస్తున్నారా?

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ బస్సు యాత్రకు భారీ స్పందన వస్తుంది...
- Advertisement -
- Advertisement -