Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఈయన తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడమే కాకుండా చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో ఆయనతో భేటీ అయిన అనంతరం జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తాయి అంటూ తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ విధంగా జనసేన టిడిపి పొత్తు ఖరారు కూడా చేసేసారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొత్త విషయం గురించి ప్రకటించిన అనంతరం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్ నువ్వెంత నీ స్థాయి ఎంత నీ బతుకు ఎంత అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆయనకు రివర్స్ కౌంటర్ ఇస్తూ కామెంట్ చేశారు. అయితే స్కూల్ కి వెళ్లే ఓ చిన్నారి సైతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆ చిన్నారి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో ఈ చిన్నారి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నువ్వు ఎంత నీ బతుకెంత మా మామయ్య జగన్మోహన్ రెడ్డిని అనే అంత మొగోడివా నువ్వు. అసలు రాజ్యాంగం గురించి నీకేం తెలుసు అని ఇలా మాట్లాడుతున్నావు. రాజ్యాంగాన్ని గౌరవించామంటే పుస్తకాలు పట్టుకొని తిరగడం కాదు ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడిని గౌరవించడం అయిన నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి.
రెండు చోట్ల ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన నీకు వీటన్నింటి గురించి ఎలా తెలుస్తాయి. అయినా నాకు ఒక విషయం అర్థం కాదు నీ మాటలు ఏంటో నీ పిచ్చి రాజకీయాలు ఏంటో అర్థం కావడం లేదు నువ్వు ఇలాగే పిచ్చివాగుడు వాగుతూ ఉన్నావంటే నీకు ప్రజలే బుద్ధి చెబుతారు జాగ్రత్త ఇంకొకసారి మా జగన్ మామయ్య జోలికి వస్తే బాగుండదు ఖబడ్దార్ అంటూ తన స్టైల్ లో ఈ చిన్నారి పవన్ కళ్యాణ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.