Midday Meal: విద్యార్థుల భోజనంలో అది కలపడంతో అస్వస్థత..

Midday Meal: ఏ రాష్ట్రంలోనైనా విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం వివిధ పథకాలు ప్రవేశపెడుతోంది. ప్రభుత్వ పాఠశాలలో అధిక సంఖ్యలో పేద విద్యార్థులు ఉంటారు కాబట్టి.. వారి చదువులకు వారి కుటుంబ సభ్యులకు భారం కాకూడదనే ఉద్దేశ్యంతో విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలన్నీ పాఠశాలలోనే కల్పిస్తోంది. పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం కూడా కల్పిస్తోంది.

గతంలో మధ్యాహ్న భోజనం అంతగా రుచి ఉండటం లేదని విద్యార్థులు ఇళ్ల నుంచి తెచ్చుకునేవారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఏ విద్యార్థి కూడా ఇంటి నుంచి భోజనం తీసుకురాకూడదని భావించి నాణ్యమైన భోజనం వడ్డిస్తోంది. అప్పుడప్పుడు ఆ భోజనాన్ని ఉపాధ్యాయులు సైతం తింటున్నారంటే ఇట్టే అర్థమైపోతోంది పాఠశాలల్లో విద్యార్థులకు వడ్డించే భోజనం ఎలా ఉంటుందో అర్థమవుతోంది. అయితే.. కొన్ని పాఠశాలల్లో నిర్వహణ కొరవడి విద్యార్థుల ప్రాణాలమీదికి తెస్తోంది. ఇష్టానుసారంగా భోజనం వండటం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. ఇలాంటి ఘటనే తాజాగా పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది.

పశ్చిమ బెంగాల్‌లో దినాజ్‌సూర్‌లోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులంతా ఆస్పత్రి పాలయ్యారు. పాఠశాలలో భోజనం తిని ఇంటికెళ్లిన కొద్ది సేపటికే వారంతా వాంతులు చేసుకున్నారు. అప్రమత్తమైన తల్లిదండ్రులు వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్కూల్లో భోజనం చేయడంతోనే పిల్లలు అనారోగ్యం పాలయ్యారని ధర్నా చేశారు. దాంతో రంగంలోకి దిగిన అధికారులు భోజనాన్ని పరిశీలించగా అసలు విషయం బయటపడింది. భోజనం వండేటప్పుడు ఉప్పుకు బదులుగా డిటర్జెంట్‌ వాడటంతో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు అధికారులు గుర్తించి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పట్టుబడగా క్షేత్రస్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -