TDP-JSP: టీడీపీ, జనసేన పొత్తుపై ఆర్జీవీ సినిమా.. జగన్‌తో భేటీలో జరిగింది అదేనా?

TDP-JSP:: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో సీఎం వైఎస్ జగన్ భేటీ కావడం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ జగన్ నుంచి పిలుపు రావడంతో ఆర్జీవీ తాడేపల్లిలో వెళ్లి జగన్ ను కలిశారు. ఈ భేటీలో నగరి ఎమ్మెల్యే రోజాతో పాటు ఆమె భర్త, దర్శకుడు సెల్వమణి కూడా పాల్గొన్నారు. దీంతో ఇప్పటికప్పుడు రాజకీయాలతో సంబంధం లేదని ఆర్జీవీని జగన్ ఎందుకు కలిశారనేది అనే అనుమానాలకు దారి తీస్తోంది. చంద్రబాబు, పవన్ లకు వ్యతిరేకంగా సినిమాలు తీసేందుకే ఆర్జీవీని జగన్ పిలిచినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు, పవన్ కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఏపీ రాజకీయ ముఖచిత్రం మారుతోంది.

టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోవడం ఖయామని అందరూ భావిస్తున్నారు. దీంతో వైసీపీ వర్గాల్లో కలవరం మొదలైంది. ఆ రెండు పార్టీలు కలిస్తే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో చిక్కులు తప్పవని అంటున్నారు. దీంతో వారిద్దరి కూటమికి వ్యతిరేకంగా ఆర్జీవీతో సినిమా తీయించే ఆలోచనలో జగన్ ఉన్నారు. గత ఎన్నికలకుముందు ఆర్జీవీ చంద్రబాబు వ్యతిరేకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ తో ఆర్జీవీ సినిమా తెరకెక్కించారు.ఈ సారి చంద్రబాబుతో పాటు పవన్ కు వ్యతిరేకంగా మూడు సినిమాలు తెరకెక్కించే ఆలోచనలో ఆర్జీవీ ఉన్నారు. జగన్ సూచనతో ఈ సినిమాలు చేయనున్నారు. వైసీపీనే ఈ సినిమాలకు ఫండింగ్ ఏర్పాటు చేయనుంది.

జగన్ భేటీపై ఆర్జీవీ ఇప్పటికే ట్వీట్ చేశారు. వ్యూహం పేరుతో సినిమా తెరకెక్కించనున్నట్లు తెలిపారు. ఇది పొలిటికల్ సినిమా అని ప్రకటించారు. ఈ సినిమాకు పార్ట్ 1తో పాటు పార్ట్ 2 ఉంటుందంటూ ట్వీట్ చేశారు. ఇది బయోపిక్ సినిమా కాదని, రీల్ స్టోరీ కాదన్నారు. రియల్ స్టోరీ అంటూ ఆర్జీవీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీంతో చాలామంది జగన్ బయోపిక్ తీస్తున్నారని అంటున్నారు. అందులో చంద్రబాబు, పవన్ ను యాంటీగా చూపిస్తారని, చంద్రబాబు, పవన్ కలిసి ఎలా ఇబ్బంది పెడుతున్నారు.. 2014 ఎన్నికల్లో వారిద్దరు కలిసి జగన్ ను ఓడించిన అంశాలు ఈ సినిమాలో ఉంటాయని అంటున్నారు.

వ్యూహం పార్ట్ 1, పార్ట్ 2 జగన్ బయోపిక్ లుగా ఉంటాయని, ఇక మూడో సినిమా పూర్తిగా చంద్రబాబుకు యాంటీగా ఉంటుందని చెబుతున్నారు. అయితే గతంలో వైఎస్ బయోపిక్ ను మాత్ర పేరుతో దర్శకుడు మహి వీ రాఘవ్ తెరకెక్కించారు. ఆ తర్వాత జగన్ పాదయాత్ర అంశాలతో జగన్ బయోపిక్ ను యాత్ర-2 పేరుతో తెరకెక్కిస్తానంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటివరకు దానిపై ఎాలాంటి అప్డేట్ లేదు. దీంతో ఇప్పుడు ఆర్జీవీ జగన్ బయోపిక్ ను తీసే పనిలో పడ్డారని, జగన్ తో భేటీలో దాని గురించే చర్చ జరిగినట్లు చెబుతున్నారు. టీడీపీకి వ్యతిరకంగా సినిమాల ద్వారా ప్రచారం చేయాలని వైసీపీ భావిస్తోంది.

సినిమాల పట్ల జనం బాగా ఆకర్షితులవుతారు. సినిమాలు చూసేందుకు చాలామంది ఇష్టపడతారు. అందుకే సినిమాలను కూడా పార్టీలు ప్రచారం కోసం ఉపయోగించుకుంటున్నాయి. గత ఎన్నికలకు ముందు ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలను బాలకృష్ణ విడుదల చేశారు. ఇక వైసీపీ దీనికి పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తీసుకొచ్చింది. దీంతో ఈ సారి కూడా అదే ప్లాన్ ను అమలు చేసేు పనిలో వైసీపీ ఇప్పటినుంచే పడింది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -