Seethapur: వామ్మో.. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను ముక్కలు ముక్కలుగా నరికిన భర్త!

Seethapur: ఈమధ్య పరువు హత్యలు బాగా జరుగుతున్నాయి. న్యూస్ చూస్తే ఏదో ఒక హత్య గురించి బయటపడుతూనే ఉంది. ఎవరో ఒకరు తమ భార్యని చంపడమో లేక భర్తని చంపెడమో ఇలా రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి. అయితే తాజాగా ఇటువంటి వార్తనే వచ్చింది. భార్య విచ్చలవిడిగా తిరుగుతుందని ఏకంగా భర్త తనను హతమార్చాడు. ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం..

 

ఉత్తర ప్రదేశ్, సీతాపూర్ లోని లూనా గ్రామానికి చెందిన పంకజ్, జ్యోతి అని భార్యాభర్తలు. ఇక పెళ్లి జరిగిన కొంతకాలం వరకు వీరి జీవితం సజావుగా సాగింది. అయితే కొన్నాళ్ల తర్వాత జ్యోతి మత్తు పదార్థాలకు అలవాటు పడి వివాహేతర సంబంధాలు పెట్టుకుని పలుసార్లు ఇంటి నుండి పారిపోయిందని తెలిసింది. ఇలా చాలాసార్లు తన భర్త పంకజ్ ఆమెను హెచ్చరించినా కూడా ఈ మధ్యలో ఉండటం వల్ల ఆ విషయాలను పట్టించుకునేది కాదట.

 

దీంతో అతడు విసిగిపోయి నవంబర్ 9న తన స్నేహితులతో కలిసి తన భార్యను చంపాడు. చంపడమే కాకుండా ఆమె శరీరాన్ని మొత్తం ముక్కలు ముక్కలు చేశాడు. శరీరం నుంచి తలను వేరు చేసి ఇతర భాగాలను ముక్కలుగా చేశాడు. ఇక వాటిని ఓ బస్తాలో వేసి అక్కడ పడేయగా.. తలను రాయితో కొట్టి కొద్ది దూరంలో పడేశాడు.

 

దీంతో బస్తాల నుండి దుర్వాసన రావడంతో అక్కడి నుంచి వెళ్తున్న కొంతమంది గమనించి అక్కడికి వచ్చి చూడడంతో అందులో శవాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని విషయాలని తెలుసుకొని మిస్సింగ్ కేసుల ఆధారంగా నేరస్తుడు పంకజ్ ను పట్టుకోవడంతో అసలు విషయాలన్ని బయటపడ్డాయి.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -