Sekhar: శేఖర్ మాస్టర్ కన్నీటి కష్టాలను తీర్చిన హీరో ఇతనే?

Sekhar: టాలీవుడ్ లో నెంబర్ వన్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్ తన జీవితంలో జరిగిన పలు విషయాల గురించి ఓ యూట్యూబ్ ఛానల్ కు వివరించాడు. తనకు ఎంతో ఇష్టమైన డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా అని శేఖర్ మాస్టర్ తెలిపాడు. తెలుగులో దాదాపు అందరు టాప్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా చేయడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని శేఖర్ మాస్టర్ వివరించాడు.

 

పాటలు సినిమాకు ప్రాణం పోస్తే.. ఆ పాటలకు ప్రాణం పోసే పని కొరియోగ్రాఫర్లది. ఇలాంటి క్లిష్టమైన పనిని శేఖర్ మాస్టర్ ఎంతో ఇష్టంతో చేస్తూ.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగుతో పాటు ప్రస్తుతం పలు భాషల్లో తన సేవలను అందిస్తున్నాడు శేఖర్ మాస్టర్. అయితే కెరీర్ ప్రారంభంలో మాత్రం తాను ఎన్నో కష్టాలను అనుభవించినట్లు శేఖర్ మాస్టర్ పేర్కొన్నాడు.

 

దాదాపు ఆరు సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీ చుట్టూ తిరిగానని.. విసుగుపుట్టి ఇక సినిమా ఇండస్ట్రీని వదిలిపెడదామని అనుకున్న సమయంలోనే తన జీవితంలో అద్భుతం జరిగిందని శేఖర్ మాస్టర్ వివరించాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుండి తనకు ఫోన్ వచ్చిందని, దాంతో తన జీవతమే మారిపోయిందని శేఖర్ మాస్టర్ చెప్పాడు. అల్లు అర్జున్ లేకపోతే తన జీవితం మరోలా ఉండేదని శేఖర్ మాస్టర్ అభిప్రాయపడ్డారు.

 

మరోపక్క తనకు భార్య అంటే ఎంతో ఇష్టమని, తన భార్యకు కూడా తనంటే ప్రాణమని శేఖర్ మాస్టర్ వివరించాడు. అయితే తన భార్యకు డ్యాన్స్ గురించి ఏమీ తెలియదని కానీ తాను చేసే ప్రతి ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తుందని శేఖర్ మాస్టర్ అన్నారు. ప్రస్తుతం టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్.. పలు షోలకు జడ్జిగా కూాడా వ్యవహరిస్తుండటం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Bonda Uma: రాయిదాడి జగన్నాటకమేనా.. బోండా ఉమను ఇరికించే విధంగా కుట్ర జరుగుతోందా?

Bonda Uma: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల రాయి దాడి ఘటన పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా చర్చలకు కారణమైంది. సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అంటూ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను...
- Advertisement -
- Advertisement -