Senior NTR-Balayya: ఆ విషయంలో సీనియర్ ఎన్టీఆర్ బాలయ్య సేమ్ టు సేమ్!

Senior NTR-Balayya: ఎన్టీఆర్ వార‌సుడిగా నంద‌మూరి బాల‌కృష్ణ సినీ ఇండస్ట్రీలో తన హవాను కొనసాగిస్తున్నారు. బాలయ్య చేసే సినిమాలు ఇప్పుడు మంచి ఊపు మీదున్నాయి. అయితే ఎన్టీఆర్‌లో ఉన్న అన్ని ల‌క్ష‌ణాలు బాల‌య్య‌కు రాక‌పోయినా కొన్ని మాత్రం ఆయన అచ్చుగుద్దినట్లు ఉంటారు. ముఖ్యంగా డిసిప్లైన్ విషయంలో బాలయ్య తండ్రికి తగ్గ కొడుకుగా పేరుపొందారు. ఆనాడు ఎన్టీఆర్ నిర్మాత‌ల‌కు ప్రత్యేక గౌర‌వం ఇచ్చేవారు. నేడు బాలయ్య కూడా అలానే గౌరవిస్తూ ముందుకు సాగుతున్నారు.

 

బాలయ్య డిసిప్లెన్ విష‌యంలో తన అభిమానులను కసురుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. ఈ విష‌యంలో బాలయ్య అర్థం చేసుకుంటే ఆయన వారి కంటికి దేవుడిలాగానే కనిపిస్తారు. బాలయ్య టైంకి షూటింగ్ సెట్ కి వెళ్తారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఉదయం 6 గంటలకే షూటింగులకు వెళ్లేవారు. గంట ముందే ఆయన తన మేకప్ పనులు పూర్తి చేసుకునేవాడు.

 

ఇక‌ప్తే బాల‌య్య కూడా తండ్రిలాగే టైమ్ కి షూటింగ్ స్పాట్ కు చేరుకుంటారు. ఔట్ డోర్ అయినా ఇన్‌డోర్ అయినా టైంకి అక్కడ ఉంటారు. తనతో పాటు నటించేవారిని కూడా బాలయ్య టైమ్ కి రమ్మని చెబుతుంటాడు. ఓ సినిమా షూటింగులో అంజ‌లీదేవి షూటింగుకు రావ‌డం ఆల‌స్య‌మవ్వడంతో ఎన్టీఆర్ కారాలు మిరియాలు నూరారట. షెడ్యూల్ ఆల‌స్య‌మైంది కాబట్టి దేవికి కోతపెట్టి ఆ డబ్బులు తనకు ఇవ్వమని కోరారట.

 

అచ్చం ఇప్పుడు బాలయ్య షూటింగులో కూడా ఓ హీరోయిన్ అలానే చేసిందట. దీంతో ఇంకోసారి ఇలా జ‌రిగితే బాగుండదంటూ బాలయ్య వార్నింగ్ ఇచ్చారట. బాలయ్యతో పని చేసిన ఏ హీరోయిన్ అయినా తమకు మంచి గౌరవం దక్కిందని భావిస్తారు. కానీ బాలయ్య డిసిప్లైన్ కు అంతా ఫిదా అవ్వాల్సిందే. ఆయన చెప్పినట్లు వింటే అన్నీ బావుంటాయని నిర్మాతలు కూడా సలహాలు ఇస్తుంటారు. ఏదేమైనా తండ్రి గుణాలు కొడుకుగా బాలయ్యకు వచ్చాయని అందరూ మాట్లాడుకుంటుంటారు.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -