Viral: ఆ ప్రముఖ స్కూల్ పై సంచలన ఆరోపణలు.. ఏం జరిగిందంటే?

Viral: గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఏలూరు లోని తడికలపూడి హర్షిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ గురించి అనేక రకాల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కూడా ఒక తల్లి స్కూల్ యాజమాన్యం తమ బిడ్డ పట్ల వారి పట్ల ప్రవర్తించిన తీరు గురించి మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆ వీడియోలో ఆ తల్లి మాట్లాడుతూ.. నేను నా ఇద్దరు కూతుర్లను ఆ స్కూల్లో జాయిన్ చేశాను. పెద్ద పాప అక్కడే ఉన్న హాస్టల్లో చదువుకుంటుంది. చిన్న పాప ప్రతిరోజు వెళ్తూ వస్తూ ఉండేది.

 

అక్కడ స్కూల్లో పద్ధతులను చాలా కఠినంగా పెట్టారు. చిన్నచిన్న రీజన్స్ కే పిల్లలకు టీసీలు ఇచ్చేస్తున్నారు. అలా ఒక రోజు మా అమ్మాయి తీసుకెళ్లే క్యారేజీలో చిట్టి కాజాలు తినడానికి పెట్టాను. ఇంకా అదే రోజు ప్రిన్సిపల్ ఫోన్ చేసి మీ పాపను పదిరోజులు స్కూల్ మాన్పించేయండి పంపించేస్తున్నాము అని చెప్పడంతో నేను నా భర్త హడావిడిగా అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్లి చూసేసరికి మా అమ్మాయి అక్కడ ఒక చోట కూర్చునే ఉంది. ఆ క్షణంలో నేను నా భర్త కనీసం లోపలికి వెళ్లి మాట్లాడడానికి కూడా వారు మాకు పర్మిషన్ ఇవ్వలేదు.

 

అలా చాలా సేపు నన్ను నా భర్తను అక్కడి వెయిట్ చేయించి ఆ తర్వాత ఆమె మాకు మాట్లాడే అవకాశం కూడా లేకుండా అర్థగంట సేపు మాకు క్లాస్ పీకారు. అంతేకాకుండా తినడానికి చిన్న కాజాలు పెట్టాము అన్న కారుణంతో పిల్లలను పది రోజులు మానిపించేయాలని అనడంతో అదెలా కుదురుతుంది మేడం అని అడిగినప్పుడు కావాలంటే స్కూల్ మానిపించుకోండి మీరు కాకపోతే 100 మంది అన్నట్టుగా మాట్లాడింది అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా కాజాలు పెట్టినందుకు ఏకంగా టీసీలు చేశారని ఆమె తెలిపింది. అనంతరం పెద్ద కూతురు గురించి మాట్లాడుతూ పెద్దమ్మాయిని హాస్టల్లో వేసాము. హాస్టల్లో వేయకముందు ఎంతో చలాకీగా ధైర్యంగా ఉండేది కానీ హాస్టల్లోకి వెళ్లిన తర్వాత ఎవరితో మాట్లాడాలి అన్నా పిల్లలతో మాట్లాడాలి అన్న చాలా భయపడుతోంది. దగ్గరికి వెళ్తే కొడతారేమో అని చాలా భయపడుతోంది. క్లాస్ ఫస్ట్ వచ్చే నా కూతుర్ని ఎందుకు ఇలా చేశారన్నది నాకు అర్థం కావడం లేదు అందుకే ఈ ఇయర్ నుంచి నా కూతుర్ని వేరే స్కూల్లో చేర్పించాలని అనుకున్నాను అంటూ ఆమె మీడియాకు తెలిపింది.

 

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -