Janasena MLA: జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. నేను అమ్ముడుపోనంటూ?

Janasena MLA: జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గురించి మనందరికీ తెలిసిందే. మొదటినుంచి వైసీపీ సర్కార్ కు మద్దతుగా నిలిచిన రాపాక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అండగా నిలిచారు. ఇకపోతే తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి త‌మ పార్టీకి చెందిన న‌లుగురు ఎమ్మెల్యేల‌కు ఒక్కొక్క‌రికి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వ‌ర‌కు టీడీపీ ఇచ్చింది ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాపాక టీడీపీ ఇచ్చిన ఆఫర్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి.

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి మొద‌టి బేరం త‌న‌కే వ‌చ్చింద‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు రాపాక. పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో రాపాక మాట్లాడుతూ.. త‌న ఓటు కోసం మిత్రుడైన టీడీపీ నాయ‌కుడు కేఎస్ఎన్ రాజును ఆ పార్టీ నేత‌లు పంపార‌ని, తాను సిగ్గుశ‌రం వదిలేస్తే తనకు రూ.10 కోట్లు వ‌చ్చేవ‌ని అన్నారు. అయితే త‌న వ‌ద్ద డ‌బ్బు ఉండి వ‌ద్ద‌న‌లేదని రాపాక అన్నారు. ఒక‌సారి ప‌రువుపోతే స‌మాజంలో వుండ‌లేము అని తెలిపారు రాపాక. అసెంబ్లీ ద‌గ్గ‌ర కూడా కేఎస్ఎన్ రాజు టీడీపీకి ఓటు వేయాల‌ని కోరారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

 

అంతేకాకుండా తనకి టీడీపీలో చేరితే మంచి పొజిషన్ ఇప్పిస్తామని ఆఫర్ ని ఇచ్చినట్లు కూడా చెప్పుకొచ్చారు రాపాక. కానీ తాను జ‌గ‌న్‌ను నమ్మాను కాబ‌ట్టి టీడీపీ ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించి న‌ట్టు రాపాక వ‌ర‌ప్ర‌సాద్ వెల్లడించారు. రాపాక తాజా ఆరోప‌ణ‌ల‌తో ఓటుకు నోటు వ్య‌వ‌హారం కొత్త మ‌లుపు తిరిగింది. కాగా తాజాగా రాపాక వరప్రసాద్ చేసిన ఆరోప‌ణ‌ల‌ పై టీడీపీ ఎటువంటి స‌మాధానం ఇస్తుంది అన్నది ప్రస్తుతం ఉత్కంఠ గా మారింది. ప్రస్తుతం ఇదే విషయం గురించి ఏపీలో తీవ్ర స్థాయిలో చర్చలు నడుస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -