TV Actress Jeevitha: బుల్లితెర నటి జీవిత సంచలన వ్యాఖ్యలు.. అలా చేయాలంటూ?

TV Actress Jeevitha: కాస్టింగ్ కౌచ్.. ఈ పేరు ఎక్కువగా సినీ ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా అన్ని ఇండస్ట్రీలో కూడా హీరోయిన్ లు, మహిళా ఆర్టిస్టులు ఈ కాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఇప్పటికే ఎంతోమంది కాస్టింగ్ కౌచ్ బారిన పడిన హీరోయిన్ లు మీడియా ముందు నోరు విప్పిన సంగతి తెలిసిందే. అలాగే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ లుగా రాణిస్తున్న హీరోయిన్స్ కెరీర్ ఆరంభంలో ఈ క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఎదుర్కొన్నవారే.

ఇకపోతే అసలు విషయంలోకి వెళ్తే ఒక బుల్లితెర నటి కూడా ఈ విధంగానే కెరియర్ ఆరంభంలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఎదుర్కొందట. ఈ విషయాన్ని ఆమె ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పకొచ్చింది. ఆ నటి మరెవరో కాదు కడైకుట్టి సింగం తమిళ సీరియల్ ఫేమ్ జీవిత. కాగా తమిళ సీరియల్ నటి అయిన జీవిత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా కెరియర్ ఆరంభంలో తను ఎదుర్కొన్న ఒక చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా జీవిత మాట్లాడుతూ..

 

ఒక దర్శకుడు జీవితకీ ఒక సినిమాలో హీరోయిన్ పాత్ర ఆఫర్ చేశాడట. అంతేకాకుండా అధిక రెమ్యూనరేషన్ ఇచ్చి మరిన్ని సినిమా అవకాశాల ఇప్పిస్తాను అంటూ ఆశ చూపించాడట. అవన్నీ కావాలం టే వాటి కోసం సర్దుకు పోవాలని కోరాడట. అయితే అప్పుడు జీవిత ఇండస్ట్రీ కొత్త కావడంతో కెమెరామెన్, నిర్మాత, మేనేజర్‌తో కూడా సర్దుకుపోవాలి అని చెప్పారట. అలాగే ఎప్పుడు పిలిస్తే అప్పుడు గదికి రావాలి అన్నారటీ. దాంతో దర్శకుడి మాటలకు ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే కన్నీళ్ల్య్ పెట్టుకుందట. దర్శకుడి మాటలను అవమానంగా ఫీలయ్యి అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా వచ్చేసిందట. ఈ విషయాలన్నీ కూడా జీవితా స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

 

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -