Delhi High Court: ఢిల్లీ హైకోర్ట్ సంచలన నిర్ణయం.. అసలేం జరిగిందంటే?

Delhi High Court: మన భారత దేశంలో ప్రతి ఒక్క పౌరుడికి ఆధార్ ఎంతో కీలకమైన డాక్యుమెంట్ గా మారిపోయింది.మనకు అవసరమైనటువంటి బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ రేషన్ కార్డు ఏ విధమైనటువంటి డాక్యుమెంట్ అయినా కూడా ఆధార్ కార్డుతో తప్పనిసరిగా అనుసంధానం చేయాల్సి ఉంది. ఇలా ఆధార్ ఒక వ్యక్తికి చాలా కీలకమైన డాక్యుమెంట్ అని చెప్పాలి. ఇలా ప్రతి ఒక్క డాక్యుమెంట్ కు ఆధార్ అనుసంధానం జరగగా ప్రస్తుతం ఒక వ్యక్తి స్థిర చరాస్తులను కూడా ఆధార్ అనుసంధానం చేయాలని తాజాగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.

భారతదేశ పౌరులకు సంబంధించిన స్థిర చర ఆస్తులకుసంబంధించిన పత్రాలను తప్పనిసరిగా ఆధార్ అనుసంధానం చేయాలి అంటే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటీషన్ పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వం నుంచి తమ అభిప్రాయాలను కోరారు. ఇక ఈ పిటిషన్ వివరించిన చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ జస్టిస్ యశ్వంత్ శర్మలతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్ పై విచారణ జరపడం కోసం నాలుగు వారాల సమయం ఇచ్చారు.

 

ఇలా ఆస్తులతో ఆధార్ అనుసంధానం చేయటం వల్ల అవినీతి, నల్లధనం, బినామీ చెల్లింపులను అరికట్టడం కోసమే ఆస్తులను ఆధార్ అనుసంధానం చేయాలని ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్ పరిశీలించిన ధర్మాసనం తిరిగి విచారణను జూలై 18వ తేదీకి వాయిదా వేశారు. ఇలా అవినీతి నల్లధనం ఆస్తులను జప్త చేయడం ప్రభుత్వ బాధ్యత అంటూ లాయర్ అశ్విని ఉపాధ్యాయ్ పిటిషన్ దాఖలు చేశారు.

 

ఇక ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇది కూడా సరైన నిర్ణయం అని అయితే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాల నుంచి మరింత స్పందన రావాల్సి ఉందని ధర్మాసనం తెలిపింది.ఇలా ఆస్తులను కూడా ఆధార్ అనుసంధానం చేయడంతో పలువురు ఈ విషయంపై స్పందిస్తూ ఇక మిగిలినది ఆస్తులు మాత్రమేనని.. దీనిని కూడా ఆధార్ అనుసంధానం చేయడం ఏంటి అంటూ విమర్శలు చేస్తున్నారు. మరి ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టు వచ్చే విచారణలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -