Serial Actress: మరో నటితో ఉండగా భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నటి.. ఇంతకీ ఎవరంటే?

Serial Actress: ప్రముఖ తమిళ బుల్లితెర నటి దివ్య (Divya) పోలీస్ స్టేషన్ లోనూ చీటింగ్ కేసు నమోదు చేసింది. 2017లో నటుడు అర్నవ్ తో ప్రేమ వివాహం చేసుకుంది. టీవీ సిరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న దివ్య తన వివాహ జీవితంలో మాత్రం ముందుకు రాలేకపోయింది. కొన్ని రోజుగా వీరి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడి దాంపత్య జీవితంలో సమస్యలు మొదలైనది.

వీరి ప్రేమాప్రయాణంలోకి ఒక సారి చూసినట్లయితే .. ‘కేలాడి కన్మణి’ సిరీయల్ తో దివ్య, అర్నవ్ కు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరి అభిప్రాయాలు కలవడంతో రొమాంటిక్ రిలేషన్ కూడా మొదలు పెట్టారు. 2017లోనే సీక్రెట్ గా కూడా పెళ్లి చేసుకున్నారు. 5 సంవత్సరాల నుండి ఓ అపార్ట్ మెంట్ లో ఇద్దరు కలిసి ఉంటున్నామని, ఇప్పుడు తాను గర్భవతి అని ,తాను గర్భవతని తెలిసినప్పటి నుండి మరింత దూరంగా పెడుతున్నాడని చెప్పింది.

అంతే కాకుండా తన భర్త చిత్ర షూటింగ్ లో భాగంగా మరోనటితో రిలేషన్ లో ఉండగానే రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నానని ఆ సమయంలో నేరుగా అక్కడి వెళ్లి.. తన భర్తను మరో నటిని నిలదీయగా ఆ మరోనటి తనను కొట్టిందని, తనముందే భర్తకు కిస్ కూడా పెట్టిందని ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనను మోసం చేశాడంటూ, ఇంకా తన భర్త పెళ్లికి సంబంధించిన వివరాలు, ఫొటోలను ఎక్కడా షేర్ చేయకూడదని హెచ్చరిస్తున్నాడని దివ్య ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో తనకు న్యాయం చేయాలంటూ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ప్రకారం పోలీసులు విచారణ చేపట్టారు.ఈ మధ్య కాలంలో సినీ రంగంలో నటీనటులు విడిపోతూ అభిమానులకు షాక్ ఇస్తున్న విషయం మనందరికీ తెలుసు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -