Lakshmi Vasudevan: ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందడంతో ఆ టెక్నాలజీని మంచి కన్నా చెడు చేయడం కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.ఈ క్రమంలోనే ఇదే అదునుగా భావించిన కొందరు సైబర్ నేరగాళ్లు సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఆ టెక్నాలజీ ద్వారా వారి ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారి పర్సనల్ డేటా మొత్తం తీసుకుని వారిని బ్లాక్ మెయిల్ చేయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు.
ఇప్పటికే ఎంతోమంది ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోగా తాజాగా బుల్లితెర నటి లక్ష్మి వాసుదేవన్ కి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురయింది. సైబర్ నేరగాళ్ల చేతిలో తన ఫోన్ హ్యాకింగ్ కి గురి కావడంతో తన ఫోటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని నటి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఈమె తన విషయంలో జరిగిన తప్పు ఎవరికీ జరగకూడదు అంటూ అందరిని అప్రమత్తం చేశారు.
గత కొద్దిరోజుల క్రితం తన అకౌంట్లో 5 లక్షలు క్రెడిట్ అయ్యాయని మెసేజ్ రావడంతో తాను లింక్ ఓపెన్ చేసిందని అయితే ఆ లింక్ ఓపెన్ చేయగానే తనకు తెలియకుండా తన ఫోన్లో కొత్త యాప్ అప్లోడ్ అవడంతో తన ఫోన్ హ్యాకింగ్ గురైందని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా మరుసటి రోజు నుంచి వరుసగా లోన్ తీసుకున్నానని 5 వేలు చెల్లించాలంటూ మెసేజ్ లు రావడం ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి.
ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్లు తన ఫోటోలను మార్ఫింగ్ చేసి తన వాట్సప్ గ్రూప్ లో ఫ్రెండ్స్ కు బంధువులకు షేర్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, 5000 రూపాయలు చెల్లించకపోతే తన ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామంటూ బెదిరిస్తున్నారని ఈ సందర్భంగా ఈమె కన్నీళ్లు పెట్టుకున్నారు.ఇలా తనని బ్లాక్ మెయిల్ చేయడంతో పోలీసులను ఆశ్రయించిన ఈమె తనలా ఎవరు మోసపోకూడదని ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.