Jr NTR: బాలకృష్ణ కూతురు ఎంగేజ్మెంట్ లో ఎన్టీఆర్ ను ఆ విధంగా అవమానించారట!

Jr NTR:  టాలీవుడ్ ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి నటనలో తాతకు తగ్గా మనవడుగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఎన్టీఆర్ అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. అలా ఎన్టీఆర్ స్టార్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వెలుగుతూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక ఇటీవల విడుదలైన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా వెలుగుతున్నాడు. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా సినీ అవకాశాలు అందుకుంటున్నాడు. ఇదిలా ఉంటే సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశాడు. జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ స్టార్ట్ చేసి 25 సంవత్సరాలు అవుతుంది. అయితే ఎన్టీఆర్ ను మొదటిసారిగా విశ్వామిత్ర సినిమా లో సీనియర్ ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ బాల భరతుడు పాత్రలో నటించాడు.

ఆ విధంగా జూనియర్ ఎన్టీఆర్ ను సీనియర్ ఎన్టీఆర్ దగ్గరికి తీసుకున్నాడు. ఇక సీనియర్ ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత పూర్తిగా నందమూరి ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ దూరమయ్యాడు. చివరికి బాలకృష్ణ కూతురు ఎంగేజ్మెంట్ కి కూడ వీరిని లోపలికి రానివ్వలేదు. అంటే ఆ రేంజ్ లో అవాయిడ్ చేశారు. ఆ రోజు నుంచి ఎన్టీఆర్ తన జీవితంలో ఒక సక్సెస్ సాధించి తన ఫ్యామిలీ ను అంతా తన వైపు తిప్పుకోవాలని భావించారని భరద్వాజ్ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాబోయే సినిమా విషయానికి వస్తే ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ 31 అనే ప్రాజెక్టుకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరి ఈ రెండు సినిమాలతో ఎన్టీఆర్ ప్రేక్షకులను ఏ విధంగా కట్టుకుంటాడో చూడాలి. త్వరలో ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ థియేటర్లో విడుదల కాబోతుంది.

Related Articles

ట్రేండింగ్

Namrata Shirodkar: రోజురోజుకూ మహేష్ భార్య చిన్నపిల్లవుతోంది.. 50 ఏళ్ల వయస్సులో ఇదేం అందమంటూ?

Namrata Shirodkar:  మనకు వయసు పైబడే కొద్ది మన అందం కూడా తగ్గుతుందని చెప్పాలి. ఇలా వయసు పైబడిన కొద్ది అందం కాపాడటం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు కానీ...
- Advertisement -
- Advertisement -