Shanmukh Jaswanth: షణ్ముఖ్ జశ్వంత్ ఇలా చేశాడేంటి.. అభిమానులే షాకయ్యారుగా!

Shanmukh Jaswanth: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతోమంది అభివృద్ధి చెందిన ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని పెద్ద ఎత్తున ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుంటూ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ ఒకరు. ఈయన యూట్యూబర్ గాఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అలాగే పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు.

ఇలా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి షణ్ముఖ్ బిగ్ బాస్ అవకాశాన్ని కూడా అందుకున్నారు.ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఈయన విన్నర్ అవుతారని ప్రతి ఒక్కరూ భావించినప్పటికీ సిరితో కలిసి ఈయన వ్యవహరించిన తీరు ఈయనపై భారీగా నెగిటివిటీని పెంచేసింది. ఇలా విన్నర్ కావాల్సిన షణ్ముఖ్ చివరికి రన్నర్ గా మిగిలారు. ఇక ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత దీప్తి సునయన షణ్ముఖ్ కు బ్రేకప్ చెప్పుకున్న విషయం మనకు తెలిసిందే.

 

ఇలా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ బిగ్ బాస్ తర్వాత బ్రేకప్ చెప్పుకోవడమే కాకుండా తిరిగి ఎప్పుడూ కూడా ఎక్కడ కలిసి కనిపించింది లేదు. ఇక బ్రేకప్ అనంతరం ఎవరి కెరియర్ లో వాళ్ళు బిజీగా ఉండిపోయారు. ఈ క్రమంలోనే షణ్ముఖ్ నటించినటువంటి అయ్యయ్యో అనే ఒక యూట్యూబ్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటలో షణ్ముఖ్ ఫణి పూజిత అనే అమ్మాయితో చాలా రొమాంటిక్ గా డాన్స్ చేశారు. ఏకంగా ముద్దు సీన్లు కూడా ఈ పాటలో కనిపించాయి.

 

ఈ విధంగా షణ్ముఖ్ పూజితతో కలిసి ముద్దు సీన్లలో నటించడంతో ఈ పాట కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పాట చూసినటువంటి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక ఈ పాటపై స్పందించినటువంటి నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అరే ఏంట్రా ఇది అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం ఈ పాట కనుక దీప్తి చూస్తే ఎంత ఫీల్ అవుతుంది బ్రో, ఇలా చేసావ్ ఏంటి అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. కేవలం దీప్తిపై రివెంజ్ తోనే ఇలా చేశావుగా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Volunteers Joined In TDP: నెల్లూరు టీడీపీలో చేరిన 100 మంది వాలంటీర్లు.. జగన్ కు ఇంతకు మించిన షాక్ ఉండదుగా!

Volunteers Joined In TDP: ఏపీలో వైయస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అన్నట్టు...
- Advertisement -
- Advertisement -