Shanthi Swaroop: ఆ డబ్బుతోనే కారు కొన్నా.. శాంతి స్వరూప్ షాకింగ్ కామెంట్స్!

Shanthi Swaroop: బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమాలు ఎంతోమందికి మంచి జీవితాన్ని అందించాయని చెప్పాలి.ఈ విధంగా బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమై ప్రస్తుతం వాళ్లు ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా మంచి హోదా అనుభవిస్తున్నారు. ఇలా సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్న వారిలో శాంతి స్వరూప్ ఒకరు. శాంతి స్వరూప్ హైపర్ ఆది స్కిట్ లో లేడీ గెటప్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందారు.

ఈ విధంగా లేడీ గెటప్ ద్వారా శాంతి స్వరూప ప్రతివారం ప్రేక్షకులను తమదైన శైలిలో సందడి చేస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇకపోతే బుల్లితెర కార్యక్రమాల ద్వారా మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ నడపడమే కాకుండా నిత్యం తనకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో శాంతి స్వరూప్ జబర్దస్త్ సెట్లో ఒక కారు పక్కన నిలబడి ఫోటో దిగారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఎంతోమంది ఆ ఫోటో పట్ల చాలా నెగిటివ్ కామెంట్ చేశారని ఈయన ఆవేదన వ్యక్తం చేశారు.నీ మొహానికి అలాంటి కారు కొనే స్తోమత ఉందా అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు ఇంత కాస్ట్లీ కారు కొనడానికి ఎవరి పక్కన పడక వేశావు అంటూ దారుణమైన కామెంట్లు చేశారని ఈయన ఆవేదన చెందారు.

ఈ క్రమంలోనే తాను జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో కష్టపడి స్కిట్లు చేస్తూ ప్రతి రూపాయి పోగు చేసి తనకు ఎంతో ఇష్టమైన కారును కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే ఆ కారుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన గురించి నెగిటివ్ కామెంట్లు చేస్తున్న వారికి తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు.నేను మీలాగా ఎవరి పక్కలోనో పడకలు వేసి సంపాదించలేదు అలా కనుక సంపాదించి ఉంటే ఈపాటికి ఎప్పుడో కార్లు బంగ్లాలు కొనే వాడినని తెలిపారు.నేను జబర్దస్త్ స్కిట్ల ద్వారా ప్రతి రూపాయి పోగు చేసి కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొనుగోలు చేశానని తనదైన శైలిలో ఈయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Nandamuri Balakrishna: మాటల తూటాలు పేల్చిన బాలయ్య.. కర్నూలులో పంచ్ డైలాగ్స్ తో రేంజ్ పెంచాడుగా!

Nandamuri Balakrishna: టీడీపీ సీనియర్ నాయకుడు హిందూపురం ఎంపీ నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఈ యాత్ర కూటమి పార్టీల తరఫున చేస్తున్నారు. యాత్రలో...
- Advertisement -
- Advertisement -