Congress President Elections: కాంగ్రెస్ అధ్యక్షుడి రేసులో శశిథరూర్? సోనియాతో కీలక సమావేశం!

Congress President Elections: కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి కోసం ప్రస్తుతం ఎన్నికలు జరుగుతన్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో కీలక నేతలు పోటీ పడుతుండటంతో అధ్యక్షుడిగా ఎవరు ఎంపిక అవుతారనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. నేతల మధ్య గట్టి పోటీ ఉండటంతో అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ లో కాక రేపుతోన్నాయి. ఒకే పార్టీలో నేతలు చాలామంది అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతుండటం కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. చివరికి అధ్యక్ష పదవి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది హస్తం శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది.

ఇప్పటికే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో కేరళలోని తిరువనంతపురం ఎంపీగా ఉన్న శశిథరూర్ కూడా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం కాంగ్రెస్ ఉత్కంఠభరితంగా మారింది. సోమవారం కాంగ్రెస్ తాత్కాలిక జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఆయన భేటీ అయ్యారు. సోనియగాంధీ నివాసంలో ఆమెను కలిసి అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సోనియా గాంధీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పోటీలోకి దిగండి.. ఎన్నికలు నిబంధనల ప్రకారం జరుగుతాయి అని శశిథరూర్ ఠాకూర్ కు సోనియాగాంధీ సూచించారు.

కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సోనియా గాంధీ అనుమతి తీసుకునేందుకు శశిథరూర్ కలిశారు. సోనియా కూడా ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చని సూచించారు. సోనియా నుంచి అనుమతి రావడంతో శశిథరూర్ త్వరలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఇప్పటికే అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో కూడా ఆయన నామినేషన్ దాఖలు చేసే అవకాశముంది. నవరాత్రి సందర్భంగా సెప్టెంబర్ 26 నుంచి సెప్టెంబర్ 28 మధ్యలో ఆయన నామినేషన్ దాఖలు చేసే అవకాశముందని తెలుస్తోంది.

ఇక కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ మాట్లాడుతూ.. అధ్యక్ష పదవి ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేసే స్వేచ్చ ఉందన్నారు. పోటీ చేయడానికి ఎవరి అనుమతి అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్య, పారదర్శక ప్రక్రకియ ద్వారా ఎన్నిక జరుగుతుందని తెలిపారు. ఇక కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చని తెలిపారు.

శశిథరూర్ అసమ్మతి కాంగ్రెస్ నేతల గ్రూప్ జీ-23లో భాగం కానపప్పికీ.. కాంగ్రెస్ లో సంస్కరణ గురించి ఆయన గళం ఎత్తారు. జీ-23 నేతలను మార్చిలో శశిథరూక్ కలిసి కాంగ్రెస్ లలో సంస్కరణలు తీసుకురావడం గురించి చర్చించారు. కాగా 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -