Krishna: కృష్ణ విజయనిర్మలను పెళ్లి చేసుకున్నాక ఇందిరాదేవి ఎలా రియాక్ట్ అయ్యిందో తెలుసా?

Krishna: టాలీవుడ్ ప్రేక్షకులకు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి తన నటన గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి అప్పటి టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. కొంతకాలానికి కృష్ణకు వయసు మీద పడడంతో సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇక సూపర్ స్టార్ కృష్ణ భార్య ఇందిరా దేవి మనందరికీ తెలిసిందే.

కాగా ఈమె ఈరోజు అనగా సెప్టెంబర్ 28న అనారోగ్యం కారణంగా తన ఇంటిలోనే మరణించారు. ఈ విషయం తెలిసే సీని రాజకీయ వర్గాలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక మహేష్ బాబు అభిమానులు మహేష్ తల్లి చనిపోవడంతో ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరా దేవి గారి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సూపర్ స్టార్ కృష్ణ తన మేనమామ కూతురు అయినటువంటి ఇందిరా దేవి ని పెళ్లి చేసుకున్నాడు.

కృష్ణకు మొదటి పెళ్లి అయిన తర్వాత సినిమాల్లో అవకాశాలు బాగా పెరిగాయి. ఈ సమయంలోనే సినీనటి విజయనిర్మల కృష్ణకు పరిచయం అయింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 1969 లో వీరిద్దరూ తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు అని అప్పట్లో వార్తలు వినిపించాయి. మొదట వీరిద్దరూ ఎవరికి తెలియకుండా రహస్యంగా తెలియజేసుకున్నప్పటికీ.. తర్వాత కృష్ణ తన రెండవ పెళ్లి గురించి ఇంట్లో తెలిపాడు.

ఇక ఈ విషయం తెలియగానే మొదటి భార్య ఇందిరా దేవి ఒక గదిలోకి వెళ్లి కొన్ని గంటల పాటు బయటకు రాలేదట. కొన్ని గంటల తరువాత బయటికి వచ్చిన ఇందిరా దేవి రమేష్ బాబు, పద్మావతిని తన దగ్గరికి తీసుకొని కంట కన్నీరు పెట్టిందట. ఆ సమయం లో ఇందిరా దేవి ఎవరిని ఏ మాట కూడా అనలేదు. ఇక కృష్ణను పన్నెత్తు మాటకూడా అనలేదట.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -