Dhawan: కోహ్లీని సమం చేసిన శిఖర్ ధావన్.. ఐపీఎల్‌లో రికార్డు

Dhawan: టీమిండియా స్టార్ క్రికెటర్, పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లోనే విజృంభించాడు. 40 పరుగులు చేసి ఈ సీజన్ తొలి మ్యాచ్ లోనే ఆకట్టుకున్నాడు. కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ విజయం సాధించింది. కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. పంజాబ్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. పంజాబ్ 20 ఓవర్లో 191 పరుగుల భారీ స్కోరు చేసింది.

192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. 16 ఓవర్లకు 146/7 పరుగులు చేసింది. అయితే భారీ వర్షం పడటంతో అంపైర్లు డీఆర్ఎస్ విధానం అమలు చేశారు. దీంతో పంజాబ్ గెలిచినట్లు ప్రకటించారు. అయితే ఈ మ్యాచ్ లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ బానుక రాజపక్సతో కలిసి రెండో వికెట్ కు ధావన్ 86 పరుగులు జోడించారు. దీంతో ఐపీఎల్ లో అత్యధికసార్లు 50కిపైగా పరుగులు భాగస్వామ్యాలు సాధించిన క్రికెటర్ గా ధావన్ అరుదైన రికార్డు సృష్టించాడు.

 

ఐపీఎల్ చరిత్రలో ధావన్ కు ఇదే అరుదైన రికార్డుగా చెబుతున్నారు. ఐపీఎల్ లో ధావన్ ఇప్పటివరకు 94 హాఫ్ సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేశాడు. ఇప్పటివరకు ఈ విషయంలో కోహ్లీ ముందు ఉన్నాడు. ఆర్సీబీ తరపున కోహ్లీ 94 హాఫ్ సెంచరీ భాగస్వామ్యాలు అందించాడు. దీంతో కోహ్లీ రికార్డును శిఖర్ ధావన్ సమం చేశాడు. కోహ్లీ, శిఖర్ ధావన్ ఒకటి, రెండు స్థానాల్లో ఉండగా.. సురేష్ రైనా మూడు, డేవిడ్ వార్నర్ నాలుగో స్థానంలో ఉన్నారు.

 

సురేష్ రైనాకు 83 హాఫ్ సెంచరీ భాగస్వామ్యాలు, డేవిడ్ వార్నర్ కు 82 అర్థవతక భాగస్వామ్యాలు ఉన్నాయి. అయితే కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో 29 బంతుల్లో ధావన్ 40 పరుగులు చేయగా.. ఇందులో ఆరు ఫోర్లు ఉన్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Note for Vote Case: ఓటుకు నోటు కేసును కావాలనే తెరపైకి తెస్తున్నారా.. చంద్రబాబును కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Note for Vote Case:  ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఇలా ఓటుకు నోటు కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు రేవంత్...
- Advertisement -
- Advertisement -