Shiva Jyothi: యాంకర్ శివజ్యోతికి ఇలా అయ్యిందేంటి?.. కొత్త ఇల్లు అప్పుడే కూలిపోయింది!?

Shiva Jyothi: తెలుగులో యాంకర్లు ఎంతోమంది ఉన్నా.. శివజ్యోతికి మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు, ఫాలోయింగ్ ఉంది. ఆమె తెలంగాణ వార్తలను చదివే విధానం ఎంతో మందిని ఆకట్టుకుంది. అందుకే తెలంగాణ వార్తలను ఎంతో స్టైలిష్ గా, సహజంగా చదువుతూ.. తీన్మార్ వార్తలకు మరింత పబ్లిసిటీ తెచ్చిన యాంకర్ గా శివజ్యోతి నిలిచింది. ఇక టీవీ షోలతో పాటు అప్పుడప్పుడు కార్యక్రమాలకు హోస్ట్ గా ఉండటం, సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టి పలు వీడియోలు చేయడం లాంటివి చేస్తుంటుంది.

 

 

బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత ఫేమస్ అయిన శివజ్యోతి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరును గడించింది. తాజాగా ఆమె తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియోను పోస్ట్ చేసి.. కొత్త ఇల్లు అప్పుడే అధ్వానంగా తయారైందని, దారుణం అంటూ కామెంట్ చేసింది. ఇంతకీ ఎవరి ఇల్లు, ఏం జరిగిందనే వివరాలను తెలుసుకుందాం.

 

 

యాంకర్ గా స్థిరపడిన శివజ్యోతి.. పెళ్లి చేసుకొని సంతోషంగా హైదరాబాద్ లో ఉంటోంది. అయితే తాజాగా శివజ్యోతి తన అత్తగారికి ఊర్లో కొత్త ఇల్లు కట్టివ్వాలని అనుకుంది. అనుకున్నట్టుగానే కొత్త ఇంటి కాంటాక్టును ఓ కాంట్రాక్టర్ కు అప్పగించింది. ఈ ఆదివారం ఆమె తన ఇంటి పనుల గురించి ఆరా తీస్తే షాక్ తగిలేలా నాణ్యత ఉన్నట్లు వీడియోలో వివరించింది. కొత్త ఇంటి విషయంలో కాంట్రాక్టర్ ఏమాత్రం నాణ్యత పాటించలేదని, తమకు నచ్చినట్లు అస్సలు కట్టలేదని వాపోయింది.

 

 

కొత్త ఇంట్లో ఒక్క కిచెన్ మినహా మిగిలిన ఇల్లు మొత్తం నాశనం చేశారని సదరు కాంట్రాక్టర్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క రూ.50వేలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని.. మిగిలిన డబ్బులు కట్టేశామని.. కానీ పనుల విషయంలో కాంట్రాక్టర్ ఇప్పటికీ వేధిస్తున్నాడని ఆమె చెప్పుకొచ్చింది. మొత్తానికి సెల్ఫులు సరిగ్గా పెట్టలేదని, అరకొర క్వాలిటీతో ఇల్లు నిర్మించారని చెప్పింది. అలాగే తాము లైటింగ్ విషయంలో చాలాసార్లు మొత్తుకున్నా కాంట్రాక్టర్ పట్టించుకోలేదని శివజ్యోతి మండిపడింది.

 

 

 

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -