ShivaJyothi: అభిమానులకు శుభవార్త చెప్పిన శివజ్యోతి.. కల నెరవేరడంతో?

ShivaJyothi: తీన్మార్ సావిత్రిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న శివజ్యోతి.. తన యాంకరింగ్‌ శైలితో తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరింతగా చేరువైంది. టీవీ యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన శివజ్యోతి.. తన ఒరిజినల్ నేమ్ కంటే.. తీన్మార్ సావిత్రిగానే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలంగాణ యాసలో ఆమె చెప్పే వార్తలు వినడానికి కొన్ని లక్షల మంది ఎదురు చూస్తుంటారు. శివజ్యోతి.. నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామం నుంచి హైదరాబాద్‌కు వచ్చిన విషయం చాలా మందికి తెలుసు. సొంత టాలెంట్‌తో టీవీ యాంకర్‌గా తనేంటో ప్రూవ్ చేసుకుంది. అలా గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి తెలుగు రియాలిటీ షో ‘బిగ్‌బాస్’లో కూడా అడుగుపెట్టింది. ఈ షో ద్వారానే ఆమె పేరు శివజ్యోతి అని, తన అభిమానులు ‘జ్యోతక్క’ అని పిలువడం మొదలుపెట్టారు.

 

బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన శివజ్యోతి.. తెలుగు రాష్ట్ర ప్రజల మదిలో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఆటను ఎంతో జెన్యూన్‌గా ఆడటం, ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్ అయి.. అందరి చేత కంటతడి పెట్టించిన విషయం తెలిసిందే. అప్పుడు బిగ్‌బాస్ తోటి కంటెస్టెంట్ అలీకి దగ్గరై.. అక్కా తమ్ముడి బంధంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్‌బాస్‌లో ఉన్నన్ని రోజులు పాజిటివ్ నేచర్ కలిగిన వ్యక్తిగా ట్యాగ్ వేయించుకుంది. అయితే బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికొచ్చిన తర్వాత సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకున్న విషయం తెలిసిందే. తన యూట్యూబ్ ఛానెల్‌లో డైలీ ఈవెంట్స్, ట్రావెల్, సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ వస్తోంది. మరోవైపు టీవీ యాంకర్‌గా కొనసాగుతూ.. పలు షోలకు గెస్టుగా కూడా హాజరవుతోంది. రెండు చేతులా సంపాదించుకుంటూ ఫుల్ బిజీగా ఉంటుంది. అయితే తాజాగా శివజ్యోతి తన అభిమానులకు ఓ శుభవార్తను చెప్పుకొచ్చింది.

తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ విషయాన్ని షేర్ చేసింది. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే.. శివజ్యోతి కొత్త ఇల్లు కట్టుకుంటుంది. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పటికే ఒక ఇంటిని, బీఎండబ్ల్యూ కారును కొన్న శివజ్యోతి.. మరో ఇల్లును కట్టుకుని అందరినీ సర్‌ఫ్రైజ్ చేసింది. భారీ వ్యూవ్స్ తో గృహప్రవేశానికి సంబంధించిన వీడియో నెట్టింట ట్రెడింగ్‌గా నిలిచింది. ఈ వేడుకకు శివజ్యోతి సన్నిహితులు, స్నేహితులు, బిగ్‌బాస్ సెలబ్రిటీలు హాజరయ్యారు.

Related Articles

ట్రేండింగ్

Raghurama Krishnam Raju: రఘురామ కృష్ణంరాజు కల నెరవేరిందిగా.. ఉండి ఎమ్మెల్యేగా ఆయన విజయం పక్కా!

Raghurama Krishnam Raju: ప్రస్తుత నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలుపొందారు. ఇలా గెలిచిన కొద్ది రోజులకే పార్టీ పిఠాయించి తెలుగుదేశం చెంతకు చేరారు....
- Advertisement -
- Advertisement -