Shoaib Akhtar: వైరల్ అవుతున్న షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు!

Shoaib Akhtar: దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రియులకు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. షోయబ్ అక్తర్ తన ఫేస్ బౌలింగ్ తో పాకిస్తాన్ కి ఎన్నో విజయాలను అందించిన సంగతి తెలిసిందే. కాగా షోయబ్ అక్తర్ స్పీడ్ ని తట్టుకొని నిలబడగలిగే బ్యాటర్లు చాలా తక్కువ ముందే ఉన్నారని చెప్పవచ్చు. అక్తర్‌ తాను రాణిస్తున్న సమయంలో ఎంతోమంది బ్యాట్స్మెన్ లను వణికించాడు. అతన్ని చూసి ఎంతోమంది భయపడినప్పటికీ ఒక భారత బ్యాటర్ మాత్రమే సమర్థవంతంగా ఎదుర్కొనే వాడు అనే చెప్పుకొచ్చారు అక్తర్‌.

ఆ భారత్ బ్యాటర్ మరెవరో కాదు టీమ్ ఇండియా దిగ్గజ ఆటగాడు అయినా సచిన్ టెండూల్కర్. ఒకటి రెండు కాదు దాదాపుగా 24 ఏళ్ల సుధీర్ఘ కెరియర్ లో సచిన్ ఎంతోమంది బౌలర్లను ఎదుర్కొన్నారు. అంతేకాకుండా సచిన్ వికెట్ తీయాలని ఎంతోమంది బౌలర్లు భావించేవారు. అంటే సచిన్ ని అవుట్ చేయడం అంటే మ్యాచ్ గెలవడం కన్నా ఎక్కువగా భావించేవారు అలాంటి ఆటగాడికి అక్తర్‌ లాంటి బౌలర్‌ను ఎదుర్కొవడం పెద్ద విషయం కాదని చెప్పవచ్చు. ఈ విషయంపై అక్తర్‌ సైతం ఏకీభవిస్తూ.. 1999, 2003 వరల్డ్‌ కప్‌లలో పాకిస్థాన్‌ భారత్‌ చేతిలో ఓడింది. ఆ సమయంలో నా బౌలింగ్‌లో ఆడేందుకు చాలా మంది బ్యాటర్లు​ వణికిపోయేవారు.

 

నేను బౌలింగ్‌ వేస్తుంటే కాలు కదిపేందుకు కూడా భయపడేవారు. కానీ ఒక్క సచిన్‌ టెండూల్కర్‌ మాత్రం బౌలింగ్‌ను బాగా ఆడేవాడు. అలాగే వరల్డ్‌ కప్‌ లాంటి వేదికల్లో భారత్‌ చేతిలో పాకిస్థాన్‌ ఓడిపోవడానికి జట్టుపై ఉండే ఒత్తిడే ప్రధాన కారణం. 1999లో కూడా ఇదే జరిగింది. నిజానికి ఆ వరల్డ్‌ కప్‌ కంటే ముందు భారత్‌తో జరిగిన అనేక మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌ గెలిచింది. కానీ వరల్డ్‌ కప్‌కు వచ్చేసరికి సాధారణంగా ఉండే ఒత్తిడిని టీవీల్లో మీడియా వాళ్లు మరింత పెంచేసారు. టీవీలు చూసి మేము కూడా మాకు తెలియకుండానే ఒత్తిడికి గురవ్వడం వల్లే మ్యాచ్‌ ఓడిపోయేవాళ్లు. భారత్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే క్రేజ్‌, హైప్‌, ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. కానీ వరల్డ్‌ కప్‌ లాంటి మ్యాచ్‌ల్లో మాత్రం దాన్ని మరింత పెంచేస్తారు అని అక్తర్‌ చెప్పుకొచ్చాడు. అలాగే గతేడాది జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియాను పాకిస్థాన్‌ ఓడించింది అని చెప్పుకొచ్చారు అక్తర్‌.

 

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -