Shakunthalam: సమంత మూవీ బడ్జెట్ అన్ని రూ.కోట్లా.. హిట్టైనా కలెక్షన్లు రావా?

Shakunthalam: సమంత నటిస్తున్న మరో తాజా చిత్రం శాకుంతలం. నాగచైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత పూర్తిగా సినిమాలపైనే శ్రద్ధ పెట్టింది సామ్. దీంతో ఏక ధాటిగా వరుసబెట్టి సినిమాల షూటింగ్ లలో పాల్గొంటోంది. ఇందులో భాగంగా తాజాగా యశోద సినిమా చిత్రీకరణ పూర్తియినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తి కాగానే సమంత షాకింగ్ ప్రకటన చేసింది. తాను అరుదైన జబ్బుతో బాధపడుతున్నానని తెలిపింది. సోషల్ మీడియా వేదికగా ఈ వార్తను పంచుకున్నారు సామ్.

సమంత నటిస్తున్న శాకుంతలం సినిమా బడ్జెట్ అంచనాలకు మించి వెళ్తోందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు డైరెక్టర్ గుణ‌శేఖ‌ర్. ఆయనకు మామూలుగానే ఓ ఓ అల‌వాటు ఉందట. క‌థ చిన్నదైనా భారీ స్థాయిలో చెబుతాడని టాక్. సెట్లూ, హంగుల‌కు పెద్ద మొత్తం ఖ‌ర్చు చేస్తాడని చెబుతారు. అందుకే అనుకున్న బ‌డ్జెట్ లో సినిమా ఎప్పుడూ పూర్తి చేసిన దాఖలాలు లేవని చెబుతారు. సమంత నటిస్తున్నశాకుంత‌లం సినిమా విష‌యంలో ఇదే జ‌రిగినట్లు తెలుస్తోంది.

శాకుంతలం బడ్జెట్ రూ.50 కోట్లుగా అనుకున్నారట మొదట్లో. అయితే, ఇప్పుడు మొత్తం ఈ సినిమా బ‌డ్జెట్ రూ.65 కోట్లు దాటేసిందని టాక్. దీనికి ప్రీ ప్రొడ‌క్ష‌న్, ప్ర‌మోష‌న్స్ పెండింగ్ లో ఉన్నాయి. తాజాగా సమంత అరుదైన జబ్బుకు గురైంది. ఆమె త్వరగా కోలుకొని తిరిగి రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పట్లో శాకుంత‌లం సినిమా రిలీజ్ కు అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో సినిమాపై వ‌డ్డీల భారం ప‌డుతోందని నిర్మాత వాపోతున్నారట.

ఎలా చూసుకున్నా లాభాలొస్తాయంటున్న డైరెక్టర్..

అయితే, గుణశేఖర్ వాదన మరోలా ఉందట. శాకుంతలం సినిమాను పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఇది విజువ‌ల్ ఫీస్ట్ కాబ‌ట్టి భాష‌తో సంబంధం లేకుండా సినిమాను ఆదరిస్తారని డైరెక్టర్ న‌మ్మ‌కంతో ఉన్నాడట. దాంతో పాటు సమంత నటించిన య‌శోద‌ సినిమా నవంబర్ 11న రిలీజ్ కానుంది.. ఇది కూడా పాన్ ఇండియా మూవీగా వస్తోంది. య‌శోద‌ సూపర్ హిట్ గా అయ్యి, మంచి లాభాలొస్తే అది శాకుంత‌లం సినిమాకు ప్ల‌స్ అవుతుందని హోప్స్ పెట్టుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -