Viral: వైరల్ అవుతున్న ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్!

Viral: మామూలుగా చాలామందికి సినీ ఇండస్ట్రీకి అమ్మాయిలను కోడళ్ళగా స్వీకరించడానికి ఇష్టపడరు. ఎందుకంటే సినీ పరిశ్రమలో తీరు కొన్నిసార్లు కొన్ని కొన్ని విధాలుగా ఉంటాయి కాబట్టి. దాంతో వారి ప్రవర్తన కూడా అలాగే ఉంటుందని వాళ్లను కుటుంబంలో ఒకరిగా చేసుకోవడానికి ఇష్టపడరు. అయితే ఇటువంటిదే ఒక సీరియల్ నటికీ ఎదురైంది. ఇంతకు ఆమె ఎవరో కాదు యశ్మీ గౌడ.

కృష్ణ ముకుంద మురారి సీరియల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత విషయాలు బయట పెట్టింది. తనను సెట్ లో అందరూ ముకుంద అని పిలుస్తారు అని.. యశ్మీ అంటే హ్యాపీగా ఫీల్ అవుతాను అని తెలిపింది. ఇక తనకు క్యాస్టింగ్ డైరెక్టర్స్ తెలుగులో అవకాశాలు ఇచ్చారని.. అలా తనకు స్వాతి చినుకులు సీరియల్ తో కెరీర్ మొదలయింది అని తెలిపింది.

 

అన్ని పాత్రల కంటే ముకుంద పాత్ర బాగుంటుంది అని చాలామంది అంటుంటారు అని తెలిపింది. తనకు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండేదని.. అలా చిన్నప్పుడు అద్దం ముందు ప్రాక్టీస్ చేసే దానిని అని తెలిపింది. మొదట తనకు తెలుగు రాదని.. కానీ తెలుగు, కన్నడ సిమిలర్ గా ఉంటాయని తెలిపింది. తను త్రినయని సీరియల్ లో కూడా చేశానని.. ఇక సినిమాలలో చేయటం కూడా తనకు ఇష్టమని.. మంచి పాత్రలు వస్తే చేస్తాను అని తెలిపింది.

 

ముఖ్యంగా తనకు సైకో పాత్ర చేయాలని ఉందని తెలిపింది. ఇక తన తండ్రి బిజినెస్ చేస్తాడు అని.. ఇక తన ఇండస్ట్రీలోకి రావడం తన తండ్రికి ఇష్టం లేదని తెలిపింది. ఇక అందర్నీ ఇంప్రెస్ చేయడం సులువు కాదని తన తల్లి ఎప్పుడు చెబుతూ ఉండేది అని అన్నది. తన ఫస్ట్ లవ్ బ్రేకప్ అయ్యింది అని.. తను ప్రేమించిన వ్యక్తి తల్లికి తను ఇండస్ట్రీలో ఉండటం ఇష్టం లేదని అందుకే బ్రేకప్ అయ్యింది అని తెలిపింది. ఇక అలా ఒక సంవత్సరం సాగిందని తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

Nandyal: మా జీవితాలను మీరే నాశనం చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే భార్యకు భారీ షాక్ తగిలిందా?

Nandyal: ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో నామినేషన్ ప్రక్రియలు కూడా చాలా వేగవంతంగా జరిగాయి. ఇక నేటితో నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. ఇక నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ కూడా...
- Advertisement -
- Advertisement -