Sai Pallavi: వామ్మో.. సాయిపల్లవి గురించి ఈ షాకింగ్ నిజం తెలుసా?

Sai Pallavi: తనదైన శైలిలో నటిస్తూ.. రంగప్రవేశం చేసిన చాలా తక్కువ సమయంలోనే స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోయిన్ సాయి పల్లవి. తెలుగుతో పాటు ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీలలోనూ తనదైన మార్క్ వేసింది. ఇక స్టార్ డమ్ ఎంజాయ్ చేసే ప్రతి హీరోయిన్ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండడం, లేటెస్ట్ లుక్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం కామన్. అయితే సాయిపల్లవికి మాత్రం ఆ పిచ్చి లేదంటూ నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు.

ప్రతి స్టార్ హీరోయిన్ తమ న్యూ లుక్స్, ట్రెండ్స్ ఇన్ స్టా, ఫేస్ బుక్.. వంటి ఇతర ప్లాట్ ఫామ్స్ లో పంచుకుంటారు. ఫ్యాన్స్ వాటికోసం వేచి చూడడం.. వాటిని రీ పోస్ట్ చేయడం.. షేర్ చేయడం.. వైరల్ చేయడం ద్వారా ఆనందాన్ని పొందుతారు. ఇక ఆ స్టార్స్ కూడా ఫ్యాన్స్ కోసం లైవ్స్, స్పెషల్ రీల్స్, టూర్స్, లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు షేర్ చేసి ఫ్యాన్స్ కి మంచి స్టఫ్ ఇస్తారు.

అయితే స్టార్ హీరోయిన్ సాయిపల్లవి మాత్రం సోషల్ మీడియాలో అస్సలు యాక్టివ్ గా ఉండరు. కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా.. సాయిపల్లవి ఏదైనా పోస్ట్ చేయాలని అనుకుంటే.. తను కాకుండా తన చెల్లి పోస్ట్ చేస్తారు. చాలామంది హీరోయిన్లకు ఉన్న పిచ్చి సాయిపల్లవికి లేకపోవడం గమనార్హం. ఇక నెట్టింట ఈ విషయంపై పెద్ద చర్చే జరుగుతుంది.

అభిమానులు మాత్రం సాయిపల్లవి అందరికన్నా ప్రత్యేకం అని అందుకే తాను స్పెషల్ అని చెప్పుకొస్తున్నారు. ఇక ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఇతర తారలకు ఉన్న ఆ పిచ్చి, సాయిపల్లవి కి లేదంటూ.. సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YS Avinash Reddy Vs YS Sunitha: అవినాష్ రెడ్డి వర్సెస్ వైఎస్ సునీత.. కడపలో వైసీపీ మునగటానికి ఇంకేం అక్కర్లేదా?

YS Avinash Reddy Vs YS Sunitha: కడప పార్లమెంట్ అభ్యర్థి వైయస్ అవినాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. 2019 ఎన్నికలకు ముందు వయసు వివేకానంద రెడ్డి దారుణంగా హత్యకు...
- Advertisement -
- Advertisement -