Manthan: ఒక సినిమాను 5 లక్షల మంది నిర్మించారా?

Manthan: సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సినిమా అన్నాక ఒకరు, ఇద్దరూ, 4 నిర్మాణ సంస్థలు కలిసి నిర్మిస్తూ ఉంటాయి. ఎటువంటి పెద్ద సినిమా అయిన ఈ తరహా లోనే నిర్మితమవుతుంది. అయితే ఒక సినిమాను దాదాపు 5 లక్షల మంది కలిసి నిర్మించారట. ఇప్పుడు ఆ సినిమా గురించి మనం తెలుసుకుందాం. ఇక ఆ సినిమా పేరు మంథన్.

దేశంలో పాల ఉత్పత్తిని పెంచడంలో పెద్దగా కృషిచేసి విప్లవ పితామహుడిగా పేరు సంపాదించుకున్న వర్గీస్ కురియన్ జీవిత కథ నేపథ్యంలో దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనెగల్ ఈ సినిమాను తెరకెక్కించాడు. వర్గీస్ రాకతో గుజరాత్ లోని పాడి రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండాయి. కాగా ఆ సినిమా నిర్మాణానికి రైతులు భాగస్వామ్యం వహించారు. ఇక శ్యామ్ బెనెగల్ ఆలోచనకు గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ముందుకు వచ్చింది.

దీంతో ఇందులో భాగస్వాములుగా ఉన్న 5 లక్షల మంది రైతులు రూ 2 రూపాయల చొప్పున ఇచ్చారు. ప్రపంచంలో ఇంత ఎక్కువ మంది నిర్మించిన తొలి క్రౌండ్ పండింగ్ సినిమాగా చరిత్రలో ప్రత్యేకంగా మిగిలిపోయింది. ఈ సినిమాను విజయవంతం చేయడానికి అప్పట్లో రైతులు పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు. అంతేకాకుండా రైతులు ఎద్దుల బండ్ల పై గుంపులు గుంపులుగా థియేటర్లకు వెళ్లారు. కాగా ఈ సినిమా అప్పట్లో బాగా హైలెట్ అయింది.

ఈ సినిమాను చూడ్డానికి మారు మూల ప్రాంతంలో ప్రజలు కూడా చాలా ఆసక్తి చూపారు. నసీరుద్దిన్షా, అమ్రిష్ పురి, స్మిత పాటిల్, మరికొందరు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా కొన్ని జాతీయ పురస్కారాలను కూడా సొంతం చేసుకుంది. అప్పట్లో ఈ సినిమా రైతులను బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా 5 లక్షల మంది రైతులు కలిసి నిర్మించిన సినిమా కాబట్టి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

Related Articles

ట్రేండింగ్

CM Revanth Reddy Challenges KTR: నువ్వు మొగోడివైతే ఒక్క సీటైనా గెలిచి చూపించు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

CM Revanth Reddy Challenges KTR: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జన జాతర పేరిట నిర్వహించినటువంటి...
- Advertisement -
- Advertisement -