Sachivalayam Employees: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఊడుతాయా.. జగన్ సర్కార్ దెబ్బకు ఆ ఉద్యోగులకు కష్టమేనా?

Sachivalayam Employees: గాంధీజీ కలలు కన్నా స్వరాజ్యం రావాలన్న ఉద్దేశంతో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇలా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ కింద దాదాపు లక్షన్నర ఉద్యోగాలను ఇచ్చి ప్రతి ఒక్క గ్రామంలోనూ అన్ని శాఖలకు చెందిన అధికారులను నియమించారు గ్రామంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా మండల కార్యాలయం వద్ద పడిగాపులు కాయకుండా అన్ని గ్రామంలోనే వారికి అందుబాటులో ఉండే విధంగా పరిపాలన చేపట్టారు.

ఇకపోతే తాజాగా ఈ గ్రామ వార్డు సచివాలయాలపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) చేసిన వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయడం రాజ్యాంగం విరుద్ధం అంటూ కాగ్ వెల్లడించింది. స్థానిక ప్రజాప్రతినిధులను.. పౌరులను భాగస్వామ్యం చేయకుండా సచివాలయాల వ్యవస్థ రూపుదిద్దుకోవడం స్థానిక స్వపరిపాలనకు ఉద్దేశించిన రాజ్యాంగ స్ఫూర్తిని నీరుగార్చడమేనని తెలిపారు.

గ్రామ వార్డు సచివాలయాల గురించి చట్టబద్ధతమైనటువంటి స్పష్టత ఇప్పటికీ లేదు.కోర్టుల్లోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. గ్రామ సచివాలయాల్లో అధికారాల్ని సర్పంచ్ లు, కార్యదర్శుల నుంచి వీర్వోలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని హైకోర్టు కొట్టి వేసింది అలాగే మహిళా పోలీస్ వ్యవస్థపై కూడా వ్యతిరేకత ఉంది ఇలాంటి తరుణంలో ఇది చట్ట విరుద్ధం అని వెల్లడించడంతో సచివాలయ ఉద్యోగస్తులపై కాస్త ఆందోళన మొదలైంది.

ఈ వ్యవస్థ ఏర్పాటు అత్యవసరమైనందున దీనిని తీసుకొచ్చినట్లు ఆర్డినెన్స్‌ జారీ చేశారు. ఆర్డినెన్స్ కాలపరిమితి తీరింది. అసెంబ్లీలో ఇప్పటివరకు ఈ వ్యవస్థ గురించి ఆమోదం రాలేదు ఎందుకంటే ఈ వ్యవస్థ రాజ్యాంగానికి విరుద్ధం కావడంతో అసెంబ్లీలో కూడా ఇప్పటివరకు ఆమోదం రాలేదు. ఈ విషయాల గురించి కాగ్ వెల్లడించడంతో అసలు చట్టబద్ధత లేనటువంటి ఈ వ్యవస్థలో ఉద్యోగాలు చేస్తున్నందుకు తమ ఉద్యోగాలు ఉంటాయా ఊడుతాయా అన్న ఆందోళన కూడా మొదలైంది. ఈ దెబ్బతో జగన్ సచివాలయ ఉద్యోగులకు కూడా షాక్ ఇవ్వబోతున్నారా అనే సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -