Biparjoy: తెలుగు రాష్ట్రాల రైతులకు షాకింగ్ న్యూస్.. ఆ తుఫాను ప్రభావం ఉంటుందట!

Biparjoy: జూన్ మొదటి వారంలోని రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకాల్సి ఉండగా ఈ ఏడాది మాత్రం ఋతుపవనాలు ఆగమనం చాలా ఆలస్యమవుతుందని చెప్పాలి. ఈ క్రమంలోనే రైతులకు సకాలంలో వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గత ఏడాది జూన్ ఒకటవ తేదీ ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకడంతో సరైన సమయానికి వర్షాలు పడటంతో రైతన్నలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఇక ఈ ఏడాది జూన్ 7వ తేదీ వస్తున్నప్పటికీ నైరుతి రుతుపవనాలు ఇంకా శ్రీలంకని కూడా తాకడం లేదని తెలుస్తోంది. ఇలా సరైన సమయానికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకకపోవడంతో ఈ ఏదాది వర్షపాతం ఐదు శాతం తగ్గవచ్చని వాతావరణ శాఖ నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ విధంగా నైరుతి రుతుపవనాల ఆగమనం ఆలస్యం కావడానికి గల కారణం అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్ జాయ్ తుఫాను కారణంగా ఆలస్యం అవుతున్నాయి.

 

ఈ తుఫాను కారణంగా నైరుతి రుతుపవనాల ఆగమనం బలహీనపడటం చేత కేరళ తీరాన్ని తాకడానికి ఆలస్యం అవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది అయితే రాబోయే 48 గంటలలో నైరుతి రుతుపవనాలు కేరళ తీరని తాగవచ్చు అంటూ వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.ఇలా ఈ రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకడానికి మరో రెండు రోజుల సమయం అయినా పడుతుంది అంటూ ప్రైవేట్ వాతావరణ శాఖ స్కైమేట్ వెల్లడించింది.

 

తొలత జూన్ 4వ తేదీ రుతుపవనాలు కేరళకు వస్తాయని చెప్పినటువంటి ఈ వాతావరణ శాఖ ఏడవ తేదీ అయినప్పటికీ రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకలేదు అయితే అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను కారణంగానే నైరుతీ రుతుపవనాలు బలహీనపడ్డాయని తెలుస్తోంది.ఇలా నైరుతి రుతుపవనాలు రావడం ఆలస్యం కావడంతో వర్షాలు కూడా సరైన సమయానికి పడక రైతన్నలు కాస్త ఇబ్బందులను పడుతున్నారని చెప్పాలి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -