Pavitra Lokesh: పవిత్ర లోకేశ్ పై షాకింగ్ న్యూస్ వైరల్.. ఆమె స్పందిస్తారా?

Pavitra Lokesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొద్దిరోజులుగా బాగా ట్రెండ్ అవుతున్నటువంటి వారిలో నటుడు నరేష్ నటి పవిత్ర లోకేష్ ఒకరు. ఇండస్ట్రీలో వీరిద్దరూ నటీనటులుగా కొనసాగుతూ ఎన్నో సినిమాలలో జంటగా నటించారు.ఇలా సినిమాల ద్వారా ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే నరేష్ నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉంటున్నారు.అయితే త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారట పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ వార్తలు వచ్చిన విధంగానే నరేష్ పవిత్ర పెళ్లి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ విధంగా నరేష్ పవిత్ర పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు నిజంగానే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా అంటూ సందేహాలను కూడా వ్యక్తపరిచారు. అయితే ఈ పెళ్లి గురించి నరేష్ ను ప్రశ్నించగా ఆయన ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు చెబుతానని దాటవేశారు.ఇక ప్రస్తుతం ఈ జంట తమ హనీమూన్ వెకేషన్ లో ఉన్నట్టు తాజాగా వీరు షేర్ చేసిన ఫోటోలను చూస్తే తెలుస్తుంది.

 

ఇలా ఒకప్పుడు వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారని తెలియడంతో ఎంతోమంది లేటు వయసులో ఘాటు ప్రేమలో మునిగి తేలడం ఏంటి అంటూ కామెంట్లో చేశారు. అయితే ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఈ జంట పెళ్లి చేసుకుని నిరూపించారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భార్యలను వదిలేశారు పవిత్ర నాలుగవ భార్య కావడం గమనార్హం.

 

ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి మరొక వార్త వైరల్ గా మారింది. పవిత్ర లోకేష్ నటుడు నరేష్ ప్రేమకు గుర్తుగా వీరిద్దరూ ఘట్టమనేని కుటుంబానికి ఒక వారసుడిని ఇవ్వాలని భావిస్తున్నారట ఈ క్రమంలోనే వీరిద్దరూ ఒక బేబీని కూడా ప్లాన్ చేస్తున్నారని త్వరలోనే ఇందుకు సంబంధించిన గుడ్ న్యూస్ అభిమానులతో పంచుకోబోతున్నారని వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మరి నరేష్ పవిత్ర గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంత వరకు నిజముందో తెలియాలంటే తప్పనిసరిగా ఈ వార్తలపై నరేష్ లేదా పవిత్ర లోకేష్ తప్పనిసరిగా స్పందించాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

MLA Grandhi Srinivas: పవన్ అభిమానులు లేకపోతే చిరు సినిమాలు ఆడవా.. వైసీపీ మూర్ఖత్వానికి హద్దుల్లేవా?

MLA Grandhi Srinivas: కొందరు రాజకీయ నాయకుల విమర్శలు చూస్తే నవ్వాలో ఏడవాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. చేసే విమర్శలకు జరిగే పరిణామాలకి ఏమాత్రం పొంతన కుదరని విమర్శలు వారినే నవ్వులపాలు...
- Advertisement -
- Advertisement -