Takkari Donga: 2002లో భారతీయ తెలుగు బాషా పాక్షాత్య యాక్షన్ కామెడీ చిత్రంగా రూపొందిన సినిమా టక్కరి దొంగ. ఈ చిత్రానికి జయంత్ పరంజీ దర్శకత్వం వహిస్తే.. మహేష్ బాబు, లీసా రే, బిపాసా బసు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నమోదయింది.
ఇక అసలు విషయానికి వస్తే దర్శకుడు జయంత్ పరంజీ, మహేష్ బాబుతో ఒక కౌబాయ్ స్టోరీని కొదమ సింహం స్టైల్లో తీయాలని మహేష్ బాబుకు ఫోన్ చేసి కథ వినిపించారట. ఈ సినిమాకు బడ్జెట్ దాదాపు పది కోట్లు అవుతుందని.. ఈ సినిమా మీ కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా విజయం సాధిస్తుంది అని చెప్తాడు.
మహేష్ బాబు సినిమా ఓకే చేసి పారితోషకం ఏమి వద్దు సినిమాలో లాభాలు వచ్చాక ఇవ్వండి ప్రస్తుతం బడ్జెట్ భారీగా ఉంది కదా అనడంతో దర్శకుడు సంతోషించాడు. తర్వాత సూపర్ స్టార్ కృష్ణకు కలిసి కథ చెబితే మోసగాళ్లకు మోసగాళ్లు సినిమా హిట్ అయింది. కానీ లాభాలను తెచ్చి పెట్టలేదు.
మీరు రిస్క్ చేస్తున్నారేమో ఒకసారి ఆలోచించండి అంటే జయంత్ వెనుకడుగు వేయకుండా సినిమా చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. కానీ కె ఎస్ రామారావు అంత బడ్జెట్ పెట్టలేను అంటే జయంతి నిర్మాతగా ఈ సినిమాకు బడ్జెట్ పెట్టాడు. ఈ సినిమా స్క్రిప్ట్, మాటలు అంత సత్యానంద్ రాశాడు.
ఇక 2000 అక్టోబర్ 8న రామోజీ ఫిలిం సిటీ లో మెగాస్టార్ చిరంజీవి మొదటి షార్ట్ కి క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. 2001 డిసెంబర్ 18 లో ఆడియో రిలీజ్.. కాగా సాంగ్స్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక 2002 జనవరి 12న సినిమా రిలీజ్ అయ్యింది. సినిమా మాత్రం బాలీవుడ్ స్థాయిలో ఉంది.
కాస్ట్యూమ్స్ కూడా బాగానే ఉన్నాయి. కానీ హీరోయిన్స్ పాత్రలు కాస్త బోర్ కొట్టాయి. కథపై దృష్టి పెట్టి కొన్ని మార్పులు చేసి సమ్మర్ లో రిలీజ్ చేసి ఉంటే సన్సేషనల్ హిట్టుగా అయ్యేది. అలా ఈ సినిమా మొదటి వారంలో మూడున్నర కోట్ల వసూలను రాబట్టింది. తర్వాత యావరేజ్ ఫలితాలను చూపించింది.