Richa Gangopadya: టాలీవుడ్ ప్రేక్షకులకు రిచా గంగోపాధ్యాయ్ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు 2010లో విడుదలైన లీడర్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత మిరపకాయ్ సినిమాలో హీరో రవితేజ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో సంపాదించుకుంది. అనంతరం సారొచ్చారు, మిర్చి, బాయ్ వంటి సినిమాలో నటించి నటిగా తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది.
కానీ ఆ తర్వాత ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీలో కనిపించలేదు. ఇండస్ట్రీకి ఏ విధంగా దూరమైందో గానీ ఈ అమ్మడు గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి. ఈమె గతంలో ఒక స్టార్ హీరోతో నటించేటప్పుడు షూటింగ్ నేపథ్యంలో స్టార్ హీరో రీచా పై అసభ్యకరంగా ప్రవర్తించాడట. దాంతో రీచా చెప్పుతో కొడతాను అని వార్నింగ్ ఇచ్చిందట. ఇక ఆ స్టార్ హీరో రీచాకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు తన దగ్గర ఉన్నాయని తనని వేధింపులకు గురి చేసేవాడట.
దీని కారణంగానే రీచా ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ వార్తలో ఎప్పటినుంచో వస్తున్నాయి. కానీ రీచా ఈ విషయంపై ఎప్పుడు స్పందించలేదు. కానీ ఆమె ఆ తర్వాత పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్ లో బిజీగా ఉన్నట్లు తెలిసింది. తన చిన్ననాటి స్నేహితుడు జో లాంగెల్లాను 2019లో వివాహం చేసుకుంది.
వీరిద్దరి దంపతులకు 2021లో మే 21న లూకా షాన్ లాంగెల్లా అనే బాబు కూడా పుట్టాడు. రీచాకు 2007 లో యుఎస్ఎ మిస్ ఇండియా అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం ఈ దంపతులు పలు బిజినెస్ రంగాల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. కానీ రీచా గంగోపాధ్య్ మాత్రం ఆ స్టార్ హీరో వేధింపులను తట్టుకోలేక ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయిందని కొందరు వార్తలు గుప్పిస్తున్నారు.