Chiranjeevi: కర్ర సహాయంతో ఇంట్లో నడుస్తున్న చిరంజీవి.. మెగా అభిమానులకు బాధ కలిగించేలా?

Chiranjeevi: ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆర్డోస్కోపిక్ విధానంలో ముడుగు ఇన్ఫెక్షన్ తొలగించుకున్న చిరంజీవి ప్రస్తుతం విశ్రాంతి దశలో ఉన్నారు. అంటే ఆయన ఇప్పట్లో సినిమా షూటింగ్లకి హాజరయ్యే పరిస్థితి లేదు. బోళా శంకర్ సినిమా తరువాత కాస్త ఖాళీ సమయం దొరకడంతో ఆయన ఈ చికిత్సకి ఉపక్రమించారు. లేదంటే ఆయనకి ఈ మోకాలు నొప్పి చాలా రోజుల నుంచి బాధపెడుతుంది.

వరుసగా సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్న ఆయనకి బోళా శంకర్ తర్వాత కాస్త విరామం దొరకటంతో సర్జరీ చేయించుకున్నారు. అంటే అర్థస్కోపి నీ వాష్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స తీసుకున్నారు. అంటే మోకాలికి ఎలాంటి కోత ఉండదు. ప్రస్తుతం ఆయన ఇంట్లో కర్రతో నడుస్తున్నట్లు సమాచారం. ఇంకా మోకాలికి సంబంధించి కొన్ని ఎక్సర్సైజులు,కొన్ని ఫిజియోథెరపీ సిట్టింగ్స్ ఉండటం మూలాన ఆయన బయటికి ఎక్కడికీ కదలడం లేదు.

ఈ కారణంగానే ఏఎన్నార్ శత జయంతి ఉత్సవానికి కూడా ఆయన హాజరు కాలేకపోయారు. అందుకే రామ్ చరణ్ ని పంపించారని సమాచారం. ప్రస్తుతం ఆయన కళ్యాణకృష్ణ సినిమాకి పాస్ బటన్ నొక్కి, యు వి క్రియేషన్ సినిమాని ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమాలో ఆల్మోస్ట్ అనుష్క హీరోయిన్ గా ఎన్నికైన సమాచారం. అయితే ఆమెకి ఒక మలయాళం సినిమా జరుగుతున్న కారణంగా డేట్ లకి క్లాషెష్ వస్తున్నట్లు సమాచారం.

ఏది ఏమైనాప్పటికీ చిరంజీవి సినిమా అనగానే పాటలు ఫైట్లు కంపల్సరిగా ఉండాలి. లేదంటే ఆయన అభిమానులు ఒక రేంజ్ లో ఫైర్ అయిపోతారు. మరి మోకాలి శస్త్రచికిత్స అనంతరం పాటలు ఫైట్లు అంటే మరి మోకాలి పై కాస్త శ్రద్ధ పెట్టాల్సిందే. ఏదేమైనా మరొక రెండు నెలల వరకు ఆయన రెస్ట్ మోడ్ లోనే ఉంటారని సమాచారం. ఎందుకంటే ఆయన తదుపరి సినిమా నవంబర్లో ఉండబోతున్నట్లు సమాచారం. అదే జరిగితే మెగా ఫాన్స్ కి పండగే.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -