Nagarjuna: చిరంజీవి హీరో నాగార్జున జీరో.. ఘోస్ట్ తో నాగ్ పరువు పోయిందిగా?

Nagarjuna: మెగాస్టార్ చిరంజీవి అలాగే అక్కినేని నాగార్జున ఇద్దరికీ సమానమైన క్రేజ్ వెండితెరలో ఉంది. వీరిద్దరి సినిమాలు ఎప్పుడు థియేటర్లో వచ్చిన ఎవరి అభిమానులు వారు తమ హీరో సినిమాలను చూడడానికి ఎగబడేవారు. ఇక ఏ బ్యాగ్రౌండ్ లేకుండా పైకి వచ్చాడు చిరంజీవి. ఇక దివంగత అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని పంచుకొని నాగార్జున సినిమాల్లోకి వచ్చాడు. అయినప్పటికీ తన టాలెంట్ తో నటనతో తన కెరీర్ ను ముందుకు తీసుకువచ్చాడు.
సినిమాల పరంగా వీరిద్దరూ సమాన అర్హులే. ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల మధ్య వార్ జరగడం సహజమే. అలాగే సినిమా రిలీజ్ లు పోటాపోటీగా రిలీజ్ అవ్వడం కూడా సహజమే. ఇలా జరిగినప్పుడు ఒక హీరో సినిమా హిట్ అవ్వగా మరో హీరో సినిమా ఫట్ అవుతుంది.
ఇదే తరహాలో మరోసారి చిరంజీవి, నాగార్జున సినిమాలు పోటీ పడ్డాయి. దసరా కానుకగా గాడ్ ఫాదర్ అలాగే ది ఘోస్ట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా విషయానికొస్తే.. మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన సినిమా గాడ్ ఫాదర్ ఈ సినిమాలో చిరంజీవి, నయనతార సల్మాన్ ఖాన్, సత్యదేవ్ తదితరులు నటించారు.
అయితే ఈ సినిమా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చేసిన లూసిఫర్ రీమేక్ అయినప్పటికీ కొన్ని మార్పులతో ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఏకంగా 16.26 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది. ఇక నాగార్జున సినిమా ది ఘోస్ట్ విషయానికొస్తే ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో నాగార్జున సోనాల్ చౌహాన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ది ఘోస్ట్.
బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. కానీ అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేదు. ది ఘోస్ట్ సినిమా మొదటి రోజు కలెక్షన్లు కేవలం 2.45 కోట్ల రూపాయలు. అయితే గాడ్ ఫాదర్ నైజాం ఏరియాలో సాధించిన రేంజ్ లో కూడా ది ఘోస్ట్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈ విధంగా ఈ రెండు సినిమాలను పోల్చి చూస్తే గాడ్ ఫాదర్ సినిమాకే మంచి కలెక్షన్స్ వచ్చాయి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -