Chiranjeevi: పవన్‌ నిబద్దత కలిగిన వ్యక్తి.. రాష్ట్రాన్ని ఏలాలి.. చిరంజీవి కామెంట్స్ వెనక అంత్యరమేమిటి.. ?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం గాడ్ ఫాదర్ చిత్రం అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం రాజకీయ బ్యాక్‌గ్రౌండ్‌తో తెరకెక్కిన మలయాళ చిత్రం లూసిఫర్‌కు రీమేక్ కావడంతో.. ఇందులో భారీగానే పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయి. అయితే చిత్రంలో ఉన్న పొలిటైకల్ డైలాగ్స్‌పై గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. అందుకు కారణం ఆ డైలాగ్స్ ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలకు అద్దం పట్టినట్టుగా ఉండటమే కారణమనే టాక్ వినిపిస్తోంది. అలాగే గతంలో చిరంజీవి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కావడం కూడా ఇందుకు మరో కారణమని చెప్పాలి.

ఇదిలా తాజాగా గాడ్ ఫాదర్ ప్రెస్‌మీట్‌లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత చర్చకు దారితీశారు. ప్రస్తుతం చిరంజీవి తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు ప్రెస్ మీట్‌లో చిరంజీవి.. తన సోదరుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ తన తమ్ముడని.. అతని పార్టీకి భ‌విష్య‌త్తులో తాను మ‌ద్ద‌తు ఇస్తానేమోనంటూ సంచలన కామెంట్ చేశారు. ప‌వ‌న్ నిబ‌ద్ధ‌త‌, నిజాయ‌తీ క‌లిగిన నేత అని చెప్పారు. చిన్న‌ప్ప‌టి నుంచి ప‌వ‌న్ త‌న మ‌న‌స్త‌త్వాన్ని ఏమాత్రం మార్చుకోలేద‌ని అన్నారు.

తాను రాజకీయా నుంచి తప్పుకుని.. సైలెంట్‌గా ఉండటమే తన తమ్ముడికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను అని అన్నారు. నిబద్ధ‌త నుంచి ప‌వ‌న్ ఏమాత్రం ప‌క్క‌కు త‌ప్పుకోలేద‌ని చెప్పారు. ప‌వ‌న్ లాంటి నిబ‌ద్ధ‌త క‌లిగిన నాయ‌కుడు రావాల‌నేదే త‌న ఆకాంక్ష‌ తెలిపారు. భ‌విష్య‌త్తులో ప‌వ‌న్ ఏ ప‌క్షాన ఉంటాడ‌నేది ప్ర‌జ‌లే నిర్ణ‌యిస్తార‌ని ఆయ‌న చెప్పారు. పవన్‌కు రాష్ట్రాన్ని ఏలే అవకాశం ప్రజలు ఇవ్వొచ్చని.. అలాంటి రోజు రావాలని తాను కూడా కోరుకుంటున్నట్లు చిరు తెలిపారు.

ఈ వ్యాఖ్యలను చూస్తే.. భవిష్యత్తులో తను జనసేనకు మద్దతు ఇవ్వొచ్చనే సంకేతాలను పంపినట్టుగా మెగా అభిమానులు, జనసేన శ్రేణులు భావిస్తున్నారు. చిరంజీవి మరో సోదరుడు, జనసేన నేత నాగబాబు కూడా.. తమకు చిరంజీవి మద్దతు ఉంటుందని కామెంట్స్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే మెగా అభిమానులు జనసేనకు మద్దతుగా ఉండాలనే నిర్ణయం తీసుకోవడం వెనకాల కూడా ఉన్నారు.

ఈ పరిణామాలను గమనిస్తే.. ఇప్పుడప్పుడే పవన్ కల్యాణ్‌కు చిరంజీవి బహిరంగంగా ఎలాంటి మద్దతు ప్రకటించకపోయినప్పటికీ.. పరోక్ష మద్దతునైతే ప్రకటించేశారని రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట. చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు.. మెగా అభిమానులు, ముఖ్యంగా వారి సామాజిక వర్గానికి చెందినవారిని జనసేన వైపు మళ్లేలా కాసింత ప్రభావం చేసే అవకాశం కూడా లేకపోలేదు. ప్రస్తుతం వైసీపీ నేతలు పవన్ కల్యాణ్‌పై దాడి చేసే సమయంలో చిరంజీవి పేరును ప్రస్తావిస్తుంటారు. చిరంజీవి మంచోడని చెబుతూనే.. పవన్‌పై తీవ్ర పదజాలంతో విరుచుపడుతుంటారు. ఇప్పుడు గనుక చిరంజీవి జనసేనకు మద్దతు తెలిపితే.. వారందరికీ గట్టి కౌంటరిచ్చినట్టుగా అవుతందని జనసైనికులు భావిస్తున్నారు.

అయితే కొందరు మాత్రం చిరంజీవి మద్దతు జనసేనకు ఇబ్బందికరంగా మారే అవకాశం లేకపోలేదని అంటున్నారు. గత ప్రజా రాజ్యం అంశాలను ప్రత్యర్థి పార్టీల నాయకులు ప్రస్తావించే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు మాత్రం గాడ్ ఫాదర్ సినిమాపై అటెన్షన్ పెంచడానికే చిరంజీవి ఈ రకమైన కామెంట్స్ చేసి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Botsa Satyanarayana: కూటమికి ఓటేస్తే స్టీల్‌ప్లాంట్‌ని రక్షించలేమట.. అధికారంలో ఉండి ఏం చేశారు బొత్స గారు?

Botsa Satyanarayana: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసిపి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. అయితే చాలా చోట్ల వీరికి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఏర్పడుతుందని తెలుస్తుంది. ఈ...
- Advertisement -
- Advertisement -