Mahesh Babu: మహేష్ మూవీకి పూజా రావాల్సిందేనా? అయితే ఆలస్యం ఖాయమట..

Mahesh Babu: Mahesh Babuమాటల మాంత్రికుడైన డైరెక్టర్ త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తాజాగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ అవుతుందని అభిమానులు ముందు నుంచే భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. త్రివిక్రమ్ మాటలతో మాయ చేసి సంచలన విజయాన్ని అందిస్తాడని ఫ్యాన్స్ గంపెడాశలు పెట్టుకున్నారు.

 

ఈ నేపథ్యంలో మహేష్, త్రివిక్రమ్ మూవీపై తాజా అప్ డేట్ వచ్చింది. మహేష్-త్రివిక్రమ్ సినిమా రెండో షెడ్యూల్ మొదలు కావాలంటే హీరోయిన్ పూజా హెగ్డే రావాలట. ఆమె వస్తేనే కానీ హీరో హీరోయిన్ల మధ్య కాంబినేషన్ సీన్లు తీయలేకపోతున్నారట. హీరోయిన్, హీరోకు మధ్య ఈ మూవీలో ఆసక్తికర సన్నివేశాలు ప్లాన్ చేశారట గురూజీ. ఈ నేపథ్యంలో పూజా వెంటనే వచ్చి షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది.

 

 

పూజా హెగ్డే ఓ ఫంక్షన్ లో కాలు మెలికతిరిగి కింద పడిందట. ఈ నేపథ్యంలో కాలికి లెగిమెంట్ గాయమైనట్లు వార్తలు వచ్చాయి. దీంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అనంతరం విశ్రాంతి తీసుకొని, తర్వాత మరోసారి స్కానింగ్ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారట. ఈ స్కానింగ్ రిపోర్టులో అంతా నార్మల్ అని తేలితేనే ఆమె మళ్లీ కోలుకొని షూటింగ్ లో అడుగు పెడుతుంది.

 

మరికాస్త వెనక్కు జరగక తప్పదా?

మహేష్, త్రివిక్రమ్ మూవీలో ఇప్పటికే ఈ నెలలో కొన్ని షెడ్యూల్ సీన్లు ప్లాన్ చేశారట. ఈ నేపథ్యంలో పూజా రావడం కాస్త ఆలస్యమయ్యేటట్లు ఉంది. దీంతో ఈ సినిమా షూటింగ్ కాస్త వెనక్కి జరుగుతోందట. వచ్చే నెల డిసెంబర్ తొలి వారంలో ఈ షెడ్యూల్ షూటింగ్ ఉండొచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్, మహేష్ సినిమా రకరకాల కారణాల వల్ల ఆలస్యమవుతోందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు హీరోయిన్ పూజా కాలి సమస్య వచ్చి పడింది.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -