ఇకపోతే ప్రస్తుతం ఒక స్టార్ హీరోయిన్ మనవరాలు స్టార్ హీరో కూతురు, అలాగే స్టార్ హీరోకు భార్య అయినా ఆమె ప్రస్తుతం ఒక సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మరెవరో కాదు సాయేషా సైగల్. ఈమె సీనియర్ నటి నజీరా భాను మనవరాలు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో అయినా ఆర్య భార్య అన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఈమె అఖిల్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకీ పరిచయమైన విషయం తెలిసిందే.
మొదటి సినిమాతోనే భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకుంది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమా విజయం కాకపోవడంతో టాలీవుడ్ కి బాయ్ బాయ్ చెప్పేసి తమిళ ఇండస్ట్రీకి చెక్కేసింది. ఇక ఆ తర్వాత ఈమె హీరో ఆర్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ దంపతులకు ఒక పాప కూడా ఉంది. ఇక ఇది ఇలా ఉంటే కొంచెం గ్యాప్ తర్వాత ఈమె మళ్లీ ఇది అందరికి సిద్ధమయ్యింది. కోలీవుడ్ స్టార్ హీరో శింబు, గౌతమ్ కార్తీక్ నటించిన మల్టీస్టారర్ సినిమాలో అమ్మడు ఐటమ్ గర్ల్ గా ఎంట్రీ ఇచ్చింది.
దీంతో అభిమానులు సాయేషా సైగల్ పై మండిపడుతున్నారు. ఇలా ఐటమ్ సాంగ్ ఎందుకు అమ్మడు డబ్బు కోసమా.. డబ్బు కూడా బాగానే ఉంది కదా మరి దేనికోసం ఇలా చేస్తున్నావు అంటూ ఆమెను ఏకీపారేస్తున్నారు. ఇదే విషయంపై అభిమానులు మండిపడుతున్నారు.