Husband-Wife: మీ భార్య ఈ పనులు చేస్తే మాత్రం జాగ్రత్త పడక తప్పదా?

Husband-Wife: ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒత్తిడి సమస్య కూడా ఒకటి. కరోనా మహమ్మారి తర్వాత ఈ ఒత్తిడి సమస్య మరింత ఎక్కువ అయింది. అయితే కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత చాలామంది పురుషులు స్త్రీలు వారి ఇంట్లోని వాళ్ళతో సరదాగా గడుపుతూ ఎంజాయ్ చేశారు. మరి కొంతమంది ఒత్తిడిగా ఫీల్ అయ్యారు. కాగా ఈ సమయంలో కొందరు మహిళలకు చాలా ఒత్తిడి కలిగించే ఫేజ్ గా మారింది. ఎందుకంటె ఇంట్లో భర్త, పిల్లలకు ఎంతో ఇష్టంగా పనులు చేసే మహిళలు ఈ కరోనా కాలంలో చాలా ఒత్తిడికి లోనయ్యారు.

వారి పని పంచుకోలేక మనసులో మాటలు పంచుకోలేక ఎంతో ఇబ్బంది పడ్డారు. ఈ ఒత్తిడి కారణంగా వారికీ అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. సరిగా ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువ ఆహారం తీసుకోవడం వంటివి వారి శరీరంలో అనేక మార్పులు వచ్చేలా చేస్తున్నాయి. ఊరికే అలసి పోవడం, చిన్న విషయాలకు విసుక్కోవడం, బాధపడటం, చిరాకుపడటం ఇవన్నీ కూడా ఒత్తిడి ని తెలిపే లక్షణాలే అని చెప్పవచ్చు. అయితే ఒత్తిడితో బాధపడుతున్న విషయం వాళ్లకు తెలియక పోయినప్పటికీ ఇతరులు మాత్రం ఈజీగా గుర్తుపట్టవచ్చు..

 

పని ఎక్కువైనప్పుడు, భాగస్వామితో గొడవ జరిగేటప్పుడు, ఆర్థిక విషయాల్లో మీలో ఒత్తిడి లక్షణాలు కనిపిస్తారు. ఒత్తిడి ఎప్పుడో ఒకసారి వస్తే ఏం పర్లేదు కానీ దానితో ఎప్పుడూ బాధపడితే మాత్రం అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేఈ ఒత్తిడి సమస్య కారణంగా భార్య భర్తల మధ్య గొడవలు పెరుగుతాయి. ఒత్తిడి వల్ల రక్తపోటు దారుణంగా పెరుగుతుంది. గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. శరీరం బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. ఇక ఈ సమయంలో లోతైన శ్వాసను తీసుకోవాలి. అయితే స్ట్రెస్ వల్ల ప్రతి ఒక్కరూ ఇలా బిహేవ్ చేయరు.

అయితే స్ట్రెస్ ఎక్కువ రోజులు అలాగే కొనసాగితే గుండెపోటుతో పాటుగా ఇతర హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

 

అధిక రక్తపోటు బారిన కూడా పడతారు. అలాగే డిప్రెషన్, షుగర్ వ్యాధి. యాంగ్జైటీ, ఊబకాయం, స్కిన్ ప్రాబ్లమ్స్, లైంగిక సమస్యలు, పల్స్ రేటు మారడం, మతిమరుపు, హార్మోన్ ల అసమతుల్యత, అల్సర్, ఎప్పుడూ తినాలనిపించడం వంటి సమస్యలు వస్తాయి. మరి ఈ స్ట్రెస్ వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒత్తిడి సమస్యతో బాధపడేవారు గ్రీన్ టీని తాగడం వల్ల ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. గ్రీన్ టీ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా మానసిక ఒత్తిడిని కూడా తొలగిస్తుంది. అలాగే ఒత్తిడికి లోనైనప్పుడు సంగీతం మనస్సును ప్రశాంతంగా మారుస్తుంది. అంతేకాదు ఇది ఒత్తిడి నుంచి తక్షణమే ఉపశమనం కలిగిస్తుంది. ఒత్తిడి స్థాయిలు ఎక్కువైనప్పుడు వెంటనే మీకు నచ్చిన పాటలను ను పెట్టుకుని వినాలి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -