Balayya: బాలయ్య గురించి శ్రీ రాపాక షాకింగ్ కామెంట్స్.. అలా ఉన్నాడంటూ?

Balayya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే. నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీ అయ్యారు.ఇక బాలకృష్ణ అంటేనే చాలామందికి ఒక రకమైన భయం ఉంటుంది అయితే ఆయనతో పని చేసిన వారు ఆయనతో మాట్లాడిన వారు బాలయ్య మంచితనం గురించి ఆయన వ్యక్తిత్వం గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటారు.

ఇలా ఇదివరకే ఎంతోమంది సెలబ్రిటీలు బాలయ్య మంచితనం గురించి తెలియజేశారు అయితే తాజాగా నటి బిగ్ బాస్ బ్యూటీ శ్రీ రాపాక సైతం బాలయ్య మంచితనం గురించి మాట్లాడటమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో మగాడు అంటే బాలయ్య బాబు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా బాలకృష్ణ సినిమాలలో అద్భుతమైన లుక్ లో కనిపిస్తూ ఉంటారు కానీ ఆయన ఇంట్లో మాత్రం చాలా సింపుల్ గా ఉంటారని శ్రీ రాపాక తెలిపారు.

ఓసారి ఆయన ఇంటికి వెళ్ళగా ఆయన విగ్గు లేకుండా సాధారణంగా ఉన్నారని మీరు ఈ గెటప్ లోనే బాగున్నారు అని చెప్పడంతో తనకు కూడా ఇలాగే నచ్చుతుందని కానీ మన వాళ్ళు సినిమాలలో ఇలా చూపించరు కదా అంటూ బాలయ్య మాట్లాడారని ఈమె తెలిపారు. ఇక బాలయ్య ఇంట్లో మనం ఎప్పుడు వెళ్లిన ఓం అనే శబ్దం వినపడుతూనే ఉంటుందని శ్రీ రాపాక వెల్లడించారు.

ఇక బాలయ్య ఎక్కువ కోప్పడతారని చాలామంది చెబుతుంటారు కానీ ఆయనతో ఒకసారి మాట్లాడితే ఆయన వ్యక్తిత్వం మంచితనం ఏంటో తెలిసిపోతుంది. ఇక సినిమాల పరంగా అయితే మీరు 100 డ్రస్సులు వేసుకోమన్నా వేసుకొని చూపిస్తారు. ఇలా సినిమాల పరంగా డైరెక్టర్ ఏది చెబితే అది బాలయ్య చేస్తారని ఆయన నిజంగానే ఇండస్ట్రీలో గ్రేట్ అంటూ ఈ సందర్భంగా బాలకృష్ణ గురించి శ్రీ రాపాక చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu-CM Jagan: చంద్రబాబు పని అయిపోయిందా.. జగన్ ను తక్కువగా చేసి తప్పు చేశారా?

Chandrababu-CM Jagan: ఏపీ సీఎం జగన్ మాజీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ల మధ్య పచ్చ గడ్డి వేస్తే కూడా భగ్గు మంటుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఎప్పుడు విమర్శలు గుప్పిస్తూ...
- Advertisement -
- Advertisement -