Shruti Haasan: శృతిహాసన్ పచ్చిగా చేసిన కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

Shruti Haasan: ఈ రోజుల్లో సెలబ్రిటీలు ఏ విషయాన్నీ దాచడం లేదు. ప్రతి విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా బయటపెట్టేస్తున్నారు. తమకు నచ్చని విషయాలపై కూడా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు ఏ టైంలో ఏం చెప్పాలనుకున్నా ఇట్టే చెప్పేస్తున్నారు. వల్గర్‌ కామెంట్లపై కూడా చాలా ఘాటుగానే స్పందిస్తున్నారు.

 

తాజాగా స్టార్‌ హీరోయిన్‌ శృతిహాసన్‌ కూడా అటువంటి పనే చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆమెను మొదట్లో అందరూ ఐరన్‌ లెగ్‌ అంటూ మాట్లాడారు. ఆమె చేసిన ప్రతి సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. అందుకే ఆమెను ఆ పేరుతో పిలిచేవారు. అయితే గబ్బర్‌ సింగ్‌ మూవీతో ఆమెకు సక్సెస్ వచ్చింది. ఆ తర్వాత సౌత్‌ లో స్టార్‌ హీరోయిన్ గా ఆమె పేరు నిలిచిపోయింది. అంతేకాదు బాలీవుడ్‌ లోకి కూడా ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ ను ఆమె ఏలుతోంది.

 

అయితే ఆమె వ్యక్తిగతంగా మాత్రం చాలా విమర్శల పాలు అవుతోందని చాలా మంది అంటున్నారు. ఇప్పటికే చాలామందితో ఆమె లవ్‌ ఎఫైర్లు నడిపినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం శాంతాను హజారికతో ఆమె డేటింగ్ చేస్తోన్న విషయాన్ని అందరికీ చెప్పేసింది. వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ డేటింగ్‌ చేసుకుంటున్నట్లు ప్రకటించారు.

 

తాజాగా ఆమె చేసిన కామెంట్లు నెట్టింట దుమారం రేపుతున్నాయి. తన లవర్‌ తో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ తనపై వచ్చే మీమ్స్‌, ట్రోల్స్‌పై ఈ హీరోయిన్ రియాక్ట్ అయ్యింది. రాత్రి టైంలో తాను, హజారిక కలిసి ఇలాంటి మీమ్స్‌ ను చదువుకుని తెగ ఎంజాయ్‌ చేస్తామని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Big Shock to Vanga Geetha: వైసీపీ అభ్యర్థి వంగా గీతకు వరుస షాకులు.. సమస్యలు పరిష్కరించకుండా ఓట్లు అడుగుతారా?

Big Shock to Vanga Geetha: మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఏపీ మొత్తం ఒకవైపు అయితే...
- Advertisement -
- Advertisement -