IPL: ఐపీఎల్ స్టార్ట్ అయింది.. ఇండియాకు దరిద్రం పట్టుకుంది.. పాక్ మాజీ పేసర్ షాకింగ్ కామెంట్స్

IPL: భారత క్రికెట్ జట్టు ఏదైనా భారీ టోర్నీలలో ఓడితే అందరి కళ్లూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీదే ఉంటాయి. ఈ లీగ్ వల్ల టీమిండియా అసలైన క్రికెట్ ను మరిచిపోతుందని.. కాసుల కోసం తప్ప అక్కడ్నుంచి నాణ్యమైన క్రికెట్ రావడం లేదని విమర్శలు వినిపిస్తాయి. మరికొందరైతే ఐపీఎల్‌ను బ్యాన్ చేయాలని, దానివల్ల టీమిండియాకు లాభం కంటే నష్టమే ఎక్కువుందనే విశ్లేషణలూ చేస్తారు. తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు ఓటమితో ఈ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.

 

ఐపీఎల్ వల్లే టీమిండియా ఆట నానాటికీ తీసికట్టుగా మారుతుందని విమర్శలు చేస్తున్న క్రికెట్ పండితులు భారత క్రికెటర్లను ఫారెన్ లీగ్స్ లో ఆడే అవకాశమివ్వాలని, అలా అయితే వాళ్ల ఆట తీరులో మార్పులు వచ్చే అవకాశముందని వాదిస్తున్నారు. తాజాగా ఇదే విషయమై పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్ మాట్లాడుతూ.. అసలు ఐపీఎల్ వల్ల ఇండియాకు ఒరిగిందేముందని..? అది ప్రారంభమయ్యాక భారత్ ఒక్క మేజర్ టోర్నీ కూడా నెగ్గలేదని వ్యాఖ్యానించాడు.

పాకిస్తాన్ లోని ఎస్పోర్ట్స్ ఛానెల్‌‌తో అక్రమ్ మాట్లాడుతూ.. ‘2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు దానివల్ల భారత క్రికెట్ జట్టుకు భారీ ప్రయోజనాలు చేకూరుతాయని అభిప్రాయపడ్డారు. కానీ వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. భారత జట్టు చివరిసారి 2007లో టీ20 ప్రపంచకప్ నెగ్గింది. అప్పట్నుంచి మళ్లీ ఈ టోర్నీలో వరుసగా విఫలమవుతూనే ఉంది.. మరి ఇప్పుడు ఈ లీగ్ వల్ల భారత జట్టు ఏం ప్రయోజనం పొందింది..?’ అని అక్రమ్ వ్యాఖ్యానించాడు.

ఇదిలాఉండగా భారత క్రికెట్ జట్టు ఓటమిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ రమీజ్ రాజా కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘ఈ టోర్నీ ప్రారంభానికి ముందు మాకు కొన్ని అనుమానాలుండేవి. కానీ ఈ టోర్నీలో బిలియన్ డాలర్ల విలువ కలిగిన బోర్డులు కలిగిన జట్లతో పోలిస్తే పాకిస్తాన్ ఎలా మెరుగ్గా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. మేం చేస్తున్నది కరక్టే అనిపిస్తున్నది. గతనెలలో మా దేశానికి చెందిన ముగ్గురు క్రికెటర్లు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నారు..’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. పరోక్షంగా ఇది బీసీసీఐని ఉద్దేశించే చేసిన వ్యాఖ్యలు అని భారత క్రికెట్ జట్టు ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -